ఇక పేదలకు ఫ్రీగా మెడికల్ టెస్టులు - రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు

 ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం
సోమవారం నుండి ప్రారంభం

 


తెలంగాణ సర్కార్  పేదల కోసం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. అనారోగ్యం పాలై వైద్యుల దగ్గరకు వెళితే ముందుగా రకరకాల పరీక్షలు చేయించుకు రమ్మని చీటీలు చేతిలో పెడతారు. నిరుపేదలు చాలా మంది ఈ టెస్టులు చేయించుకోలేక వైద్యం కోసం దూరంగా ఉండిపోతున్నారు. ఇక నుండి సర్కార్ దావఖాన్లలో ఆ ఇబ్బందులు లేకుండా  నిరుపేదలకు  అన్ని రకాల టెస్టులు చేసేందుకు తెలంగాణలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షల కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు. వైద్య పరీక్ష కేంద్రాలు తక్షణం ప్రారంభించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు జారి చేశారు.

వైద్య శాక అధికారులతో శనివారం సమావేశం అయిన ముఖ్యమంత్రి కరోనా పరిస్థితులతో పాటు ఇతర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్, కేంద్రాలను సోమవారం ప్రారంభించాలని సూచించారు.

మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, అదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్.. జిల్లాల్లో ఇప్పటికే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 19 కేంద్రాల్లోని డయాగ్నోస్టిక్‌ కేంద్రాలను ప్రారంభించాలని సీఎం తెలిపారు.

నిరుపేదలు రోగం వస్తే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా పలు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులను మెరుగుపరిచామని తెలిపారు. 

 ప్రజలకు ఉచిత వైద్య కోసం ఇప్పటికే పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. సామాన్యుడికి వైద్యాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చి ఆరోగ్య తెలంగాణను తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మరో ముందడుగు వేస్తుందని అన్నారు. నిరుపేదలు ఎవరూ వైద్య ఖర్చుల కోసం ఆస్తులు అమ్మే పరిస్థితి రావద్దనే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి తెలిపారు.

 ప్రభుత్వ డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో 57 పరీక్షలు ఉచితంగా చేస్తారని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. వైద్యంలో అత్యంత కీలకమైన రోగ నిర్ధారణ డయాగ్నోస్టిక్‌ కేంద్రాలను తెలంగాణలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం రాష్ట్ర వైద్య చరిత్రలో గొప్ప సందర్భమని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు