ఏపి ప్రజలున్నారనే సంయమనం...జగన్

 



మావాళ్లకు ఇబ్బంది కలగొద్దనే ఇంతకాలం సంయమనం..జలవివాదాలపై జగన్ కీలక వ్యాఖ్యలు 

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదంపై ప్రధానంగా చర్చించారు

రాష్ట్రంలోని పలు సమస్యలపై చర్చించేందుకు.  తెలంగాణ,ఆంధ్ర రాష్ర్టాల జల వివాదంపై సీరియస్గా చర్చించారు. ఈ సందర్భం సిఎం జగన్ మాట్లాడుతు
తెలంగాణలో ఏపీ ప్రజలున్నారు.. వాళ్లకు ఇబ్బంది కలగకూడదనే  ఇంతకాలం సంయమనంతో ఉన్నామని అన్నారు. అలాగని ఏపీ రైతులకు అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. నీటివివాదంపై తెలంగాణ మంత్రులు పరిధి దాటి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. సమాచారం
సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఏవిధంగా ముందుకెళ్లాలో ఆలోచన చేయాలని మంత్రులకు చెప్పారు. తెలంగాణ వివాదాలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ అనుమతి లేకుండా నీటిని వినియోగిస్తున్న విషయంలో  కృష్ణా యాజమాన్య బోర్డుకు లేఖ రాయాలని సీఎం ఆదేశించారు. అలాగే జలవివాదాలపై ప్రధానికి కూడా లేఖ రాయాలని మంత్రులను ఆదేశించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు