ఆన్ లైన్ ద్వారా ఆనందయ్య కరోనా మందు పంపిణి

 అనందయ్య కరోనా మందుఆన్ లైన్ ద్వారా పంపిణి చేసేందుకు అధకార యంత్రాగం సన్నాహాలు చేస్తోంది
నేరుగా ఎవరూ కృష్ణపట్నం రాకుండా 144 సెక్షన్ విధించారు
అనందయ్య మామిడి తోటలో మందు తయారి కేంద్రం


ఆనందయ్య కరోనా మందు పంపిణీకి ఏర్పాట్లు  జరుగుతున్నాయి. ఏపీ హైకోర్టు, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో  జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో ఆనందయ్య మందును పంపిణి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్ననారు. నెల్లూరు లో అనందయ్య స్వతం మామాడి తోట లోనే మందు తయారు చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడే ఆనందయ్య తల్లి దండ్రుల సమాధాలు ఉన్నాయని అందుకే ఆ ప్రదేశంలోనే మందు తయారు చేయాలని ఆనందయ్య కోరడంతో అందుకు అధికారులు అంగీకరించారు. 

ముడి సరుకులు అనుకున్న ట్లు లభిస్తే ప్రతి రోజు లక్ష మందికి మందు పంపిణి చేస్తానని ఆనందయ్య తెలిపారు. ఎపి రాష్ర్టంలో వారికే కాకుండా పొరుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా మందు పంపిణి చేయాలని సంకల్పించినట్లు ఆనందయ్య తెలిపారు. 

కృష్ణ పట్నం ఎవరూ రావద్దు

మందు తయారీకి ఏర్పాట్లు జరుగుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల వారు భారి సంఖ్యలో కృష్షపట్నం చేరేందుకు ప్రయత్నిస్తుండగా ససరిబద్దుల్లో వారిని నిలిపి వేసేతున్నారు. కృష్ణపట్నంలో

 ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతోంది. మందుకోసం వస్తే తొక్కిసలాట జరుగుతుందని అందుకే నేరుగా మందు పంపిణి చేసే బదులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే మందు పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. జిల్లా కలెక్టర్ చక్రధర్, ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్దన్‌రెడ్డి తదితరులు మందు పంపిణీ విధానాలపై చర్చించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు