ఆనందయ్య మందుతో లేచి కూర్చున్న తెలంగాణ యువకుడు

 


ఆనందయ్య మందు ఫలితాలపై ప్రభుత్వ అధ్యయనాలు ఓ వైపు కొనసాగుతుండగా మరో వైపు మందు పనిచేసే విధానాలు  ప్రత్యక్షంగా చూసి అబ్బురపడి పోతున్నారు.  తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు కరోన సోకి గత 20 రోజులుగా క్వారెంటైన్ లో ఉండి మందులు వాడినా ఫలితం రాలేదు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి కి చెందిన ప్రకాశ్ అనే యువకుడు  శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో కృష్ణపట్నం అనందయ్య మందు గురించి వార్తల ద్వారా తెల్సుకుని  అతి కష్టంగా కృష్ణపట్నం చేరుకున్నాడు. అదే సమయంలో అక్కడ ఆనందయ్య మందు పనితీరును పరిశీలించేందుకు తెలుగు దేశం పార్టి నేతలు  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి , బిదా రవిచంద్ర, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి తదితరులు  అనందయ్య మందు పంపిణి కేంద్రం వద్దకు వెళ్లారు. అదే సమయంలో తెలంగాణ యువకుడు ఓ ఆటో డ్రైవర్ సహాంతో అక్కడుకు చేరుకున్నాడు.పూర్తిగా ఒంట్లో సత్తువు లేకుండా పోయిన ఆయువకుడిని ఓ చెట్టు కింద పడుకోబెట్టారు. యువకుడి పరిస్తితి తెల్సుకున్న ఆనందయ్య మనుషులప అక్కడకు వచ్చి అందరు చూస్తుండగానే ఆ ఉవకుడి కంట్లో మందు వేశారు.  మందు వేసిన 15 నిమిషాల తర్వాత ఆ యువకుడు లేచి కూర్చున్నాడు. ఇదంతా తెలుగుదేశం పార్టి నేతలు చూస్తుండగా జరిగింది. ఇదంతా ప్రత్యక్షంగా చూసిన వారంత ఆశ్చర్యపోయారు. 

తనది కరీంనగర్ ఉమ్మడి జిల్లా అని గత 20 రోజులుగా కరోనాకు ట్రీట్ మెంట్ తీసుకున్నానని అయినా నయం కాలేదన్నారు. ఆనందయ్య మందు విషయం తెల్సుకుని అతి కష్టంపై నెల్లూరు వచ్చానని చెప్పాడు. ఇక్కడికి వచ్చే సరికి పూర్తిగా నిస్సత్తువలో ఉన్నానని క్యూలైను చూసి తనకు మందు దొరకదేమో అని అనుకున్నానని అయితే ఓ ఆటో డ్రైవర్ తనకు సహాయం చేసి మందు ఇప్పించాడని అన్నారు. తనకు ఇప్పుడు శ్వాస బాగా అడుతోందని చెప్పాడు. ఇప్పుడు గ్రౌండ్ లో పరుగెత్తమన్నా  తాను పరుగెత్తగలనని అన్నాడు.  కార్పోరేట్ మందుల విషయంలో ప్రకాశ్ ఎమోషనల్  గా మాట్లాడాడు. తమలాంటి పేదలకు ఆనందయ్య ముందు పంపిణీ జరిగేలా చూడాలని అన్నాడు.

ఈసందర్భంగా అక్కడే ఉండి ఇదంతా ప్రత్యక్షంగా చూసిన టిడిపి నేత సోమి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా నాయకులు, అధికారులు రాజకీయాలు పక్కన పెట్టి ఆనందయ్య మందు పంపిణీ జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. నివేదికలను సాకుగా చూపి కాలయాపన చేయకుండా ఆనందయ్య ముందు పంపిణీ జరిగేలా సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకోవాలన్నారు. గతంలో కృష్ణపట్నం పోర్టు వల్ల దేశం మొత్తం కృష్ణపట్నం వైపు చూసిందని, మళ్లీ నేడు ఆనందయ్య మందువల్ల దేశమంతా కృష్ణపట్నం వైపు దృష్టిసారించిందని టీడీపీ జాతీయ కార్యదర్శి బీద చంద్ర అన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు