ఈటెలకు కెసిఆర్ కు అసలు బెడిసింది ఎక్కడ ?

 


ఈటెల రాజేందర్ పై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతీకార రాజకీయానికి ఒడిగట్టడం వెనక  ఏం జరిగింది. ఈటెల ఎందుకు పలు సందర్భాలలో కెసిఆర్ పై రాజకీయ విసుర్లు విసిరాడు. ఈటెల కెసిఆర్ ను ఆయన చుట్టు ఉన్న కోటరీని టార్గెట్ చేసి మాట్లాడినందుకే కెసిఆర్ ఈటెలను ఇలా అవమానపరిచాడా అనే విషయాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది. ఎక్కడ ఎలా కెసిఆర్ కు ఈటెలకు చెడిందనే విషయంలో విశ్లేషణలు జరిగాయి.  తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఈటెల రాజేందర్ కు ఉద్యమ సమయంలో కెసిఆర్  ఎవరికి ఇవ్వని ప్రాధాన్యత  ఇచ్చారు. ఈటెల రాజేందర్ శాసన సభ పక్షం నేతగా కూడ పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో  అసెంబ్లీలో  ఆంధ్ర పాలకులను తెలంగాణ సమస్యలపై ఉతికి ఆరేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఈటెల రాజేందర్ చూపిన  కమిట్ మెంట్ తెలంగాణ ఉద్యమ కారులకు తెలియంది కాదు.
ఈటెల లేని ఉద్యమ ఘట్టాలు లేవు. ఈటెలను కెసిఅర్ బహిరంగ వేదికలపై ఎన్ని సార్లు మెచ్చుకోలేదు.  ఈటెల రాజేందర్ నా కుడిభుజం అని చెప్పుకున్న కెసి ఆర్ ఈ రోజు ఏ గతి పట్టిచ్చిండో చూస్తే కెసి ఆర్ కాదు  'కసి ఆర్' అని పిలవాలి.

 తెలంగాణ రాష్ట్ర సాకారం అయినంక కెసిఆర్ ఈటెల మద్య దూరం పెరిగింది. మొదటి మంత్రి వర్గంలో ఈటెలకు కీలక మైన ఆర్థిక శాఖను ఇచ్చారు. కాని 

2018 ఎన్నికల అనంతరం కెసిఆర్ తన తొలి మంత్రి వర్గంలో ఈటెలకు మంత్రి పదవి ఇవ్వలేదు. అసలు ఈటెలను పూర్తిగా పక్కన పెడతారని ఏ పదవి ఇవ్వక పోవచ్చని కూడ అప్పట్లో వార్తలు వచ్చాయి. కాని రెండో సారి విస్తరణ సందర్భంగా కీలక మైన వైద్య ఆరోగ్య శాఖను ఇచ్చారు.

అయితే మొదటి నుండి  ప్రగతి శీల భావాలు కలిగిన ఈటెల రాజేందర్ కు జీ హుజూర్ అనే స్వభవం లేకపోవడంతో  ప్రగతి భవన్ పవర్ బ్రోకర్ల బాచి ఆయన్ను టార్గెట్ చేసింది. పదవుల కోసం కెసిఆర్ కు అందరూ వంగి వంగి దండాలు పెట్టి అతి వినయం ప్రదర్శించినట్లు ఈటెల రాజేందర్ ఏది ప్రదర్శించ లేదు. కెసిఆర్ కు ఈటెలకు మద్య గ్యాప్ వచ్చేందుకు  ప్రగతి భవన్ బాచే ముఖ్యకారణమని మొదటి నుండి ఆరోపణలు ఉన్నాయి. సిఎం ను ఎవరు కలవాలో ఎవరు కలవద్దో నిర్ణయించేది ఈ బాచే. ఆత్మాభిమానం కలిగిన ఈటెల ఈ బాచిని పట్టించు కోక పోవడం వల్లే కెసిఆర్ కు  టార్గెట్ గా మారాడు. పైగా ఈటెల పార్టీ పెట్టబోతున్నాడని వెనుక బడిన సామాజిక వర్గాలతో పాటు ఎస్సి, ఎస్టి, మైనార్టీలను కలుపుకుని రాష్ట్రంలో కొత్త సమీకరణలకు శ్రీకారం చుట్ట నున్నారని రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా చర్చ సాగింది. కెసిఆర్ తో వచ్చిన గ్యాప్ తో ఈటెల కూడ మద్య మద్య పలు వేదికలపై తన సహజ ధోరణిలో  ఘాటుగా స్పందించడం కెసిఆర్ కు ఆగ్రహం కలిగించడం సహజం. 

ఈటెల తన మంత్రి పదవి అడుక్కుంటే వచ్చింది కాదని అన్నారు. తనకు ఎవరో పెట్టిన బిక్ష కాదని ఇది ప్రజలు పెట్టిన భిక్ష అని అన్నారు. పార్టీ లకి మద్యలో వచ్చిన వాన్ని కాదని బతకడానికి వచ్చినోన్ని అసలే కాదని అన్నారు. ఇంకా గులాబీ జెండా ఓనర్ల మని పదవులు అడుక్కునే వాళ్లం కాదని అధికారం శాశ్వతం కాదని అన్నారు. దొంగ లెవరో దొరలెవరో త్వరలోనే తేలుతుందని  ప్రగతిభన్ బాచిని పలు సందర్బాల్లో ఈటెల టార్గెట్ చేసారు. 

వీటికి తోడు ఆ మద్య కెటిఆర్ ను ముఖ్యమంత్రి చేయబోతున్నాడని వచ్చిన ఉహాగానాల నేపద్యంలో వెనుక బడిన వర్గానికి చెందిన ఈటెలను ముఖ్యమంత్రిని చేయాలని రాజకీయ ప్రతిపాదనలు వచ్చాయి. 

ఇవేవి కెసిఆర్ కు ఆయన కోటరీకి ఖచ్చితంగా నచ్చి  ఉండవు. అందుకే టైం చూసి సాగ నంపేందుకు స్కెచ్ వేసి ఉంటారని రాజకీయంగా పలువురు విశ్లేషించారు. కాని  కెసిఆర్ ఈటెల విషయంలో వ్యవహరించిన తీరు పై తీవ్ర విమర్శలు వచ్చాయి.  ఓ సీనియర్ మంత్రి పట్ల వ్యవహరించాల్సిన విధానం ఇది కాదని అనేక మంది  అభిప్రాయ పడ్డారు. పైగా ఈటెలకు మించిన భూ కబ్జాదారులను అనేక మందిని వదిలి ఈటెలను బలి పశువును చేశారని ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

ఈటెల కూడ తనకు జరిగిన అన్యాయం  పై ఎవరిని వదిలి పెట్టేది లేదనే ధోరణిలో ఉన్నారు.

ఇక ఈటెల ఏం చేయ బోతున్నాడనేది కొద్ది రోజులు ఓపిక పడితే కాని క్లారిటి రాదు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు