లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడితే ఖఠిన చర్యలు తప్పవు

 వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి


రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించే వారిపై ఖఠిన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి  హెచ్చరించారు. బుధవారం నుండి అమల్లోకి వచ్చిన లాక్ డౌన్ పరిస్థితులను కమీషనర్ నగరంలో పలు ప్రాంతాల్లో స్వయంగా పర్యవేక్షించారు.

 ప్రధాన కూడళ్ళల్లో స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్న వాహన తనిఖీలను పోలీస్ కమిషనర్ పరిశీలించడంతో పాటు, అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులను పోలీస్ కమిషనర్ మందలించారు. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని

హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ స్థానిక పోలీస్ అధికారులకు పలుసూచనలు చేసారు. రోడ్లపై వాహనాలను నియంత్రించేందుకుగాను బారీకేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్ల మీదకు వచ్చే వాహనదారులను ప్రశ్నించి వారి గుర్తింపు కార్డులను పరిశీలించాలన్నారు. అనవసరంగా రోడ్లపై కి వచ్చి తిరిగే వారిపై  చర్యలు తీసుకోవాలని సూచించారు. అట్లాగే లాక్ డౌన్ నిభందనల నుండి మినహాయింపు కలిగిన వివిద శాఖల ఉద్యోగులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. వారి గుర్తింపు పత్రాలను పరిశీలించాలని సూచించారు. 

స్పెషల్ బ్రాంచ్ అదనపు డి.సి.పి జనార్థన్, ఎ.సి.పిలు జితేందర్ రెడ్డి, గిరికుమార్‌తో పాటు స్థానిక ఇన్ స్పెక్టర్లు చంద్రశేకర్, గణేష్ పాల్గొన్నారు.

పోలీసు పాసులకు దరఖాస్తు చేసుకోండిలా

లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలతో పాటు నిత్యావసర వస్తువుల రవాణా చేసే విభాగాలకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు నిచ్చింది. సరుకులు రవాణ చేసే వారు లాక్ డౌన్ నిభందనల మేరకు అనుమతులు ఉన్న వారు పోలీసు పాసుల కోసం వరంగల్ పోలీస్ కమీషనరేట్ లో ఏర్పాటు చేసిన స్పెషల్ కౌంటర్ లో దరఖాస్తు  చేసుకోవాలని అధికారులు సూచించారు.  వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిదిలో అత్యవసర సేవలతో పాటు నిత్యావసర వస్తువుల రవాణా చేసే వాహనల కోసం పోలీసు పాసులు జారి చేసేందుకు  పోలీస్ పరేడ్ గేట్ వద్ద కౌంటర్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఎసిపి శివరామయ్య ను - 9000466488 సంప్రదించాలని  వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు