భగత్ అనునేను..

 సాగర్ లో టిఆర్ఎఎస్ కు కల్సి వచ్చిన పోల్ మేనేజ్ మెంట్సాగర్ 

జానా రెడ్డికి అవకాశం ఇవ్వని సాగర్ ఓటర్లు


సాగర్ ఉప ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీకి పోల్ మేనేజ్ మెంట్ బాగా కల్సివచ్చింది. 

ఊహంచినట్లు గానే  టిఆర్ఎస్ పార్టి తన సిట్టింగ్ సీటును గెలిచి స్థానం నిలబెట్టుకుంది. 

టిఆర్ెస్ పార్టీకి దు్బబాకలో వ్యూహం బెడిస్తే సాగర్ లో ఫలించింది. ఈ ఎన్నికల్లో తలపడిన తల పండిన కాంగ్రేస్ పార్టి సీనియర్ నేత జానా రెడ్డి ఓటమి పాలయ్యారు. హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టి అభ్యర్థి భగత్ కు 88,982 ఓట్లతో విజయం సాధించారు. జానా రెడ్డికి 70,504 ఓట్లు దక్కాయి. భారతీయ జనతా పార్టి అభ్యర్థి డాక్టర్ రవి నాయక్ కు కేవలం7,646 ఓట్లు రాగా డిపాజిట్ కోల్పోయాడు.

సాగర్ ఉప ఎ్ననికల్లో జానా రెడ్డికి గట్టిమద్దతు లభించింది. జానారెడ్డి విజయాన్ని అడ్డుకునేందుకు టిఆర్ఎస్ పార్టి పకడ్బంది పోలింగ్ మేనేజ్ మెంట్ తోడ్పడింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కల్సికట్టుగా ఉప ఎన్నికల ప్రచారంలో సాగర్ లో తిష్ట వేసి జానా రెడ్డి గెల వకుండా కట్టడి చేసారు. టిఆర్ఎస్ పార్టి సాగర్ ఉప ఎన్నికలను తేలికగా తీసు కోలేదు. ఒక వేల కాంగ్రేస్ పార్టి అభ్యర్థి జానా రెడ్డి గెలిస్తే టిఆర్ఎస్ కు జరిగే నష్టాన్ని ఊహించి పార్టి అధినేత కెసిఆర్ ముందే జాగ్రత్త పడ్డారు. స్వయంగా ఆయన సాగర్ ఎన్నికలను పర్యవేక్షించారు. సాగర్ ఉప ఎన్నికలను ఆశా మాషీగా భావించకుండా  ఆయనే వ్యూహ కర్తగా మారాడు.  ఎన్నికల షెడ్యూల్ వెలువడే కన్నా ముందే హాలియాలో బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం ఎన్నికల  ప్రచారం ముగింపులో మరో బహిరంగ సభ నిర్వహించారు.

టిఆర్ఎస్ పార్టి ఉప ఎన్నికల ప్రచారంలో ఏ అస్త్రాన్ని వదల లేదు. టిఆర్ఎస్  మని, మజిల్ పవర్లను చూసి జానా రెడ్డి బేజారయ్యాడు. ఓ దశలో ఆయన వేదాంత ధోరణి కనబరిచారు. టిఆర్ఎస్ ప్రతిపాదిస్తే ఏకగ్రీవానికి అంగీకరించి ఉండేవారిమని అన్నారు.

సాగర్ ఫలితాల అనంతరం జానా రెడ్డి మాట్లాడుతు సాగర్ తీర్పును స్వాగతిస్తున్నానని అన్నారు.గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడిన జానా రెడ్డి టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు అభినంద‌న‌లు తెలిపారు.త‌న క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తించేందుకు ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన‌ట్లు తెలిపారు. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌, కార్య‌క‌ర్త‌ల్లో మ‌రోధైర్యం నింపేందుకు ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌ట్లు జానారెడ్డి పేర్కొన్నారు.

కొద్ది రోజులు విశ్రాంతి

తనకు ఇప్పుడు 75 ఏళ్లు ఉన్నాయని, అనూహ్య పరిస్థితులు ఏర్పడితే తప్ప మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. తనకు రాజకీయాలపై వైరాగ్యం లేదంటూనే, ఇంకా తాను రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

తండ్రి స్థానంలో కొడుకు

తండ్రి నోముల నర్సంహయ్య అనారోగ్యమరణంతో భగత్ ఉప ఎన్నికల్లో పోటి చేసి తండ్రి స్థానంలో భాద్యతలు చేపట్ట బోతున్నాడు. యిన్నవయస్సులో అసెంబ్లీలో అడుగు పెట్టి ఎమ్మెల్యేగా  ప్రజల సమస్యలకు ప్రాతినిద్యం వహించ బోతున్నాడు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు