తెలంగాణలో దుర్మార్గపు రాజకీయాలు

 దుర్మార్గపు రాజకీయాలు- నీచపు ఎత్తుగడలు
కుట్రల మీద కుట్రలు - దిగజారిన  రాజకీయాలు
దివాల కోరు విధానాలు


ఓ వెనుబడిన కులాలకు చెందిన వ్యక్తిపై ఎంతగా కత్తి గట్టారో రాష్ట్ర  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ విషయంలో రుజువు అయింది. తెలంగాణ ఉద్యమంలో తనతో భుజం భుజం గలిపి తెలంగాణ సాకారం అయ్యే వరకు మడమ తిప్పని మనిషి ఈటెల  రాజేందర్. రైతుల  ఆసైన్డ్   లాండ్స్ కబ్జా పెట్టాడని ఆరోపణలతో విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఓ వైపు విచారణ జరుగుతుండగానే మరో వైపు అతని  శాఖను తొలగించారు. అధికారం చేతిలో  ఉందని దుహంకార రీరీతిలో ఈటెల రాజేందర్ ను అవమాన పర్చడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించు కోలేక పోతోంది. హుందాగా కనిపించేందుకు అయినా  కనీస రాజకీయ నైతిక  విలువలను పాటించకుండా అన్ని  తుంగలో తొక్కి ప్రతీకారేచ్ఛకు పూనుకోవడం తెలంగాణ సమాజానికే అవమాన కరం. ఇది ఒక్క ఈటెల రాజేందర్ కు జరిగిన అవమానం కాదు మొత్తం తెలంగాణ కు జరిగిన అవమానం. వెనుకబడిన కులాలకు చెందిన మంత్రిని ఇంతగా వేదించి ,సాదించడం బహశా ఉమ్మడి రాష్ర్టంలో కూడ ఆంధ్రోళ్ల పాలనలో ఎన్నడూ జరగ లేదు.

ఈటెలకు జరిగిన అవమానం, అన్యాయంపై తెలంగాణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.    ఈటెల ప్రాతినిద్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజక వర్గం ప్రజలు ఆందోళనకు దిగారు. ఈటెలకు జరిగిన అన్యాయాన్ని బిబ.సి నేతలు దోసాజు శ్రవణ్ కుమార్, వి. హన్మంతరావు తదితరులు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈటెలకు మద్దతుగా నిలుస్తున్నారు.

ఇదంతా ప్లాన్ గా కుట్ర పురితంగా జరిగింది... ఈటెల రాజేందర్

తనపై చాలా ప్లాన్ ప్రకారం కుట్ర జరిగిందని ఈటెల రాజేందర్ అన్నారు. తన నియోజకవర్గం కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. దేనికి భయ పడే వ్యక్తిని కాదని ఈ రోజు కుట్ర చేస్తే నిజాలు దాగవని వాస్తవం బయట పడే రోజులు వస్తాయని అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు