రెమ్‌డెసివర్‌ ఇంజక్షపై కేంద్రం ఊగిసలాట

 రెమ్‌డెసివర్‌ వల్ల కరోనా రోగులు కోలుకున్నట్లు ఆధారాలు లేవన్న డబ్ల్యుహెచ్‌వో

కాసుల కోసమే ప్రైవేట్ ఆసుపత్రులు రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లు వాడుతూ కరోనా భాదితులను బాదేస్తున్నాయా?

ప్రపంచ ఆరోగ్యసంస్థ కరోనా చికిత్స నుండి రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లను తొలగించినా  ఇండియాలో మాత్రం ఇంకా విచ్చల విడిగా వాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడ దీనిపై గట్టి చర్యలు తీసుకోలేక పోతోంది.

రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ అంటే ఇప్పుడు తెలియని వారుండరు.  మందు లేని కరోనా రోగానికి  దీన్ని సర్వ రోగ నివారిణిగా తెగ వాడేస్తున్నారు. ప్రైవేట్ కార్పోరేట్ ఆసుపత్రుల కైతే ఇదో వరంగా మారింది. మూడు వేల లోపు దొరకాల్సిన ఇంక్షన్ 30 వేలకు పైగా బ్లాక్ లో అమ్ముతున్నారు. రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ దొరకడమే కష్టంగా మారింది. ఇదో పెద్ద బ్లాక్ దందా అయింది. అయితే ఇది ఎంత వరకు కరోనా పేషెంట్లపై పనిచేస్తుందో తెలియదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడ ఈ ఇంజక్షన్ పై అనుమానాలు వ్యక్తం చేసింది. అయినా ఇండియాలో ఈ రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ లకు బాగా డిమాండ్ ఉంది.  అందుకే దేశంలోని కరోనా బాధితుల చికిత్సలో అత్యంత కీలకంగా మారిన రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ  కీలక నిర్ణయం తీసుకుంది. రెమ్‌డెసివర్‌ వల్ల


కరోనా రోగులు కోలుకున్నట్లు ఆధారాలు లేవని డబ్ల్యుహెచ్‌వో స్పష్టం చేసింది. కరోనా బాధితులకు ఇస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌పై తమకు అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. ఈ కారణంగానే కరోనా చికిత్స నుంచి రెమ్‌డెసివర్‌ను తొలగిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు రెమ్‌డెసివర్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రకమైన నిర్ణయం తీసుకోవడానికి ముందే.. ఈ ఔషధంపై భారత్‌లోనూ సందేహాలు వ్యక్తమయ్యాయి. దేశంలోని పలువురు వైద్య నిపుణులు సైతం కరోనా చికిత్స విధానం నుంచి రెమ్‌డెసివర్‌ను తప్పించాలనే వాదన వినిపించారు. అయితే దేశంలో, పలు రాష్ట్రాల్లో రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల బ్లాక్‌ మార్కెట్‌ దందా జోరుగా నడుస్తోంది. రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లు  కరోనా  ప్రోటోకాల్ నుండి తొలిగించినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంకా ఏ నిర్ణయం ప్రకటించ లేదు. వివిద రాష్రాల నుండి రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల కోసం కేంద్రానికి భారీగా ప్రతిపాదనలు అందుతున్నాయి. ప్రైవేట్ కార్పోరేట్ ఆసుపత్రులకు అయితే రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లు కాసుల వర్షం కురిపిస్తోంది. కేంద్రం ఈ రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లపై గట్టి నిర్ణయం తీసుకుంటే సామాన్యులు బ్లాక్ లో వేల రూపాయలు  కుమ్మరించే దుస్థితి తప్పుతుంది. ఇంతగా ఈ ఇంజక్షన్లపై అనుమానాలు వ్యక్తం అవుతున్నా  కొందరు వైద్యులు మాత్రం ఎందుకు ఈ ఇంజక్షన్లు తెచ్చుకోమంటున్నారో తెలియకి పేషెంట్ల భందవులు వాటి కోసం పరుగులు తీస్తున్నారు.

కొందరు బ్లాక్ మార్కెట్‌లో ఈ ఇంజక్షన్లను అధిక ధరకు అమ్ముతుంటే. మరికొందరు నకిలీ రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లను తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా దందాలకు పాల్పడిన అనేక మందిని  దేశవ్యాప్తంగా  పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర ఇప్పటి కైనా రెమ్‌డెసివర్‌ ఇంజక్ష వాడకం పై క్లారిటి ఇచ్చి పేషంట్లు దోపిడీకి గురి కాకుండా నిలువరించాలి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు