పశ్చిమ బెంగాల్ లో మమత అఖండ విజయం

 

తనను ముప్పు తిప్పలు పెట్టిన బిజెపీని  మట్టి కరిపించిన దీది


పశ్చిమ బెంగాల్ లో బిజెపి ముప్పుతిప్పలు పడ్డా  వర్క్ అవుట్ కాలేదు. దీదీ మమతా బెనర్జి  మూడో సారి అక్కడ హాట్రిక్ సాధించి ముఖ్యమంత్రి కాబోతున్నారు. దీదీని ఓడించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యూహం రచించినా  ఫలించలేదు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోది పాచికలు పార లేదు. మొత్తం మోది మంత్రివర్గం అంతా అక్కడే తిష్ట వేసి గల్లిగల్లితిరిగినా బెంగాల్ ఓటర్లు దీదీకే బ్రహ్మరథం పట్టారు.  ఒంటి కాలితో దీది శివంగిలా కమలానాధులతో తల పడి త్రుణమూల్ కాంగ్రేస్ పార్టీని మూడో సారి అధికారం లో నిల బెట్టారు.
బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పు దేశ ప్రజలకు కనువిప్పు కావాలి.  బెంగాల్ లో బిజెపి కుట్రలు కుతంత్రాలు చేసినా ఏమి సాధించ లేక పోయింది. చివరికి పోలింగ్ రోజు హింసకు పాల్పడి ఆఖరి నిమిషంలో దీదీని బద్ నాం చేసి ఓట్లు దండుకోవాలని చేసిన కుతంత్రం కూడ చెల్లలేదు. బెంగాల్ ఓటర్లు బిజెపి కుట్రను అర్దం చేసుకుని ఎన్నికల్లో బాగా గడ్డి పెట్టారు.

దేశ ప్రజలంతా బెంగాల్ వైపు చూసారు. అందుకు బెంగాల్  ప్రజలిచ్చిన విలక్షణ  తీర్పు దేశ రాజకీయాలను మలుపు తిప్ప బోతోందనడంలో సందేహం లేదు. కాశాయ కూటమికి వ్యతిరేకంగా దీదీ ఇక దేశమంతా ఏకం చేయడం ఖాయమని అప్పుడే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేసారు.

ఏమైనా బెంగాల్ లో జరిగింది మంచి పరిణామం. మమతా బెనర్జి గెలవడం ఒక బెంగాల్ రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ భారత దేశ ప్రజలకు కూడ మంచి శుభ సూచకం. ఎందుకంటే దేశంలో గట్టి ప్రతి పక్షం అయిన కేంగ్రేస్ పార్టి ఇప్పటికే బిజెపీని ఎదుర్కోవడంలో చతికిల పడి పోయింది. బిజెపి ముందు  కాంగ్రేస్ పార్టి పావులు పారడం లేదు. కాంగ్రేస్ పార్టీని ఎందుకో దేశ ప్రజలు అంతగా విశ్వసించడంలేదు. ఇక మమతా బెనర్జి నాయకత్వంలో  బిజెపి యేతర పార్టీలతో కొత్తగా కూటమి ఏర్పడ నుందనే ఆశ  ప్రజాస్వామ్య వాదుల్లో నెలకొంది. అందులో దీది ఎంత వరకు కృత కృత్యులు కాకనున్నారో చూడాలి.  బెంగాల్ ఎన్నికలకు ముందే దీది గతంలో కూటమి  దిశగా ప్రయత్నాలు చేసారు.

నేనే ముఖ్యమంత్రి

బెంగాల్ ఎన్నికల్లో త్రుణమూల్ కాంగ్రేస్ పార్టీకి మెజార్టి మ్యాజిక్ ఫిగర్ దాటింది. అయితే విచిత్రంగా నందిగ్రాం నుండి పోటి చేసిన మమతా ఓటమి పాలైంది. హోరా హోరీగా సాగిన పోరులో ఫలితాలు ఉత్కంఠ రేపాయి. 
 నందిగ్రామ్‌ కౌంటింగ్‌లో చివరకు సువేందు అధికారి విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. టీఎంసీ అభ్యంతరంతో రీకౌంటింగ్‌ చేశామని.. సువేందు 1736 ఓట్ల తేడాతో దీదీపై గెలిచారని ఈసీ ప్రకటించింది. 

‘నందిగ్రామ్‌లో నా ఓటమిని అంగీకరిస్తున్నాను. ఎన్నికల సంఘం బీజేపీ ప్రతినిధిలా పని చేసింది. ఈసీపై సుప్రీం కోర్టుకు వెళ్తా. నేను నందిగ్రామ్‌లో ఓడినా.. 221 సీట్లు గెలుచుకున్నాం. ముఖ్యమంత్రిగా నేనే ప్రమాణ స్వీకారం చేస్తాను. త్వరలో తేదీ ప్రకటిస్తా’ అన్నారు దీదీ.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు