మే 30 దాక లాక్‌డౌన్ పొడిగింపు

 మంత్రులతో మాట్లాడి కెసిఆర్ నిర్ణయం


రాష్ట్రంలో అమల్లో వున్న లాక్ డౌన్ ను ఈనెల  30 తేదీ దాకా పొడిగించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంత్రులందరితో మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను సిఎం కెసిఆర్  తెలుసుకున్నారు. క్యాబినెట్ మంత్రులందరి అభిప్రాయాలను సేకరించిన మేరకు సిఎం కెసిఆర్ లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం ఆదేశించారు. కరోనా నియంత్రణా కార్యక్రమాల్లో, వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బిజీగా వున్నందున ఈ నెల 20 న జరుప తలపెట్టిన క్యాబినెట్ మీటింగును సిఎం రద్దు చేశారు.
పాత నిభందనల ప్రకారమే లాక్ డౌన్ కొనసాగుతుంది. రాష్ట్రంలో లాక్ డౌన్ విధించి నప్పటి నుండి కరోనా పాజిటివ్ కేసులు తగ్గు ముఖం పట్టడంతో హై కోర్టు కూడ సంతృప్తి వ్యక్తం చేసింది. దాంతో లాక్ డౌన్ ఈ నెల 30 వరకు పొడిగిస్తు సిఎం నిర్ణయం తీసుకున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు