జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి


ముఖ్యంత్రిని కోరిన మీడియా అకాడమి చైర్మన్అల్లం నారాయణ

జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని  తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు విజ్ఞప్తి చేసారు. తెలంగాణ యూనియన్  ఆఫ్ వర్కింగ్  జర్నలిస్ట్స్  అద్యక్షులు కూడ అయిన అల్లం నారాయణ యూనియన్ ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్ తదితరులు ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రం అంద చేసారు. వైద్య, పారిశుద్య, పోలీస్ విభాగాలను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించినట్లు జర్నలిస్టులను కూడ గుర్తించాలని కోరారు. జర్నలిస్టులు వార్తా సేకరణలో నిత్యం ప్రజల మద్య గడుపుతూ ప్రజల కోసం పని చేస్తున్నారని అన్నారు.

దేశంలో కరోనా మహమ్మారి విజృంభించినప్పటి నుండి అనేక రాష్ట్రాలలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించారని అన్నారు. బీహార్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలతో పాటు కొత్తగా పశ్చిమ బెంగాల్  రాష్ట్రాలలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా రుర్తించారని అన్నారు. విధి నిర్వహణలో జర్నలిస్టులు అనారోగ్యం పాలు అయినా అకాల మరణం పొందినా వారి కుటుంబాలను  ఆర్థికంగా ఆదుకుంటున్నాయని అన్నారు. ఇతర రాష్ట్రాలలో ఆదుకున్న రీతిలో తెలంగాణ రాష్ట్రంలో  జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ముఖ్యమంత్రి కెసిఆర్ గుర్తించి ఆదు కోవాలని కోరారు.

మీడియా అకాడమీకి కేటాయించిన వెల్పేర్ ఫండ్ నుండి ఇప్పటికే జర్నలిస్టుల కుటుంబాలను అదుకోవడం జరిగిందని కరోనా భారిన పడిన వారికి కొంత మొత్తం  ఆర్థిక సహాయం  అంద చేసామని అట్లాగే చనిపోయిన వారికి 2 లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం చేసామని తెలిపారు. ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రకటిస్తే మెరుగైన ప్రయోజనాలు చేకూరుతాయని అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు