ఎంపీ రఘురామకృష్ణరాజు ను ఆసుపత్రికి తరలించాలి - హై కోర్టు

 నాటకీయ పరిణామాలు


ఎంపి రఘురామకృష్ణరాజు అరెస్ట్  వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం జిజిహెచ్  ఆసుపత్రి నుండి నేరుగా గుంటూరు జిల్లా జైళుకు తరలించగా తక్షణం రమేశ్ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం పంపాలని హై హకోర్టు ఆదేశించింది. 

ఆయన శరీరంపై గాయాలకు సంబంధించి వైద్య నివేదిక జిల్లా కోర్టు నుంచి ప్రత్యేక మెసెంజర్‌లో అందిన తర్వాత హైకోర్టు విచారణ జరిపింది. మెడికల్‌ బోర్డుతోపాటు రమేశ్‌ ఆస్పత్రి వైద్యులు గాయాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించినప్పటికీ పట్టించుకోలేదని రఘురామ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. కస్టడీలో ఉండగా సీఐడీ అధికారి పిటిషనర్‌ను కలిశారని, ఇది చట్టవిరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రిమాండ్‌ విధిస్తూ జడ్జి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తక్షణమే రఘురామను రమేశ్‌ ఆస్పత్రికి పంపాలని ఆదేశించింది.  ఎవరూ ఊహించని విధంగా గుంటూరు జీజీహెచ్‌ వెనక గేటు నుంచి ఆయన్ను జైలుకు తీసుకెళ్లారని ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబ సబ్యులు ఆరోపించారు.

ప్రాణాలకు ముప్పు 

జగన్ సర్కార్‌పై ఎంపీ రఘురామ కృష్ణ రాజు భార్య రమాదేవి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ప్రాణాలకు ముప్పు తలపెడతారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు తన భర్తను బాగా కొట్టారని ఆరోపించారు. కోర్టు నిబంధనలు పట్టించుకోరా అని ఆమె ప్రశ్నించారు. రమేశ్ ఆస్పత్రికి తరలించాలని కోరితే.పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇవాళ రాత్రి తన భర్తను చంపాలని చూస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. అసలేం జరుగుతోందో తనకు అర్థం కావడం లేదని, హత్యలు చేసేవారు రోడ్లపై తిరుగుతున్నారని. ప్రజా సమస్యలపై ప్రశ్నించేవాళ్లని జైల్లో పెడతారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

మెడికల్ రోపోర్ట్

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఒంటిపై గాయాలు కాలేదని మెడికల్ బోర్డు స్పష్టంచేసింది. వైద్య బృందం ఇచ్చిన రిపోర్ట్‌ను డివిజన్ బెంచ్ హైకోర్టులో చదివి వినిపించింది. దీంతో తనకు గాయాలు అయ్యాయని చెప్పి రఘురామ తప్పుదోవ పట్టించినట్టు అయ్యింది. రఘురామ రిమాండ్‌పై ఏఏజీ, రఘురామ అడ్వకేట్ మధ్య వాదనలు జరిగాయి. రమేశ్ ఆస్పత్రికి వెళ్లేందుకు రఘురామ తరఫు న్యాయవాదులు సుముఖత వ్యక్తం చేశారు. కానీ ఆస్పత్రిపై ఏఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మరో పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం కోరింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు