జర్నలిస్ట్ నాగరాజు కుటుంబాన్ని ఆదుకోండి

 


కరోనా మహమ్మారి పేదల బతుకులను చిద్రం చేస్తోంది. దినం రెక్కల కష్టం మీద బతికే కుటుంబాలకు దినగండంగా మారి ప్రాణాలకు ముప్పు తెచ్చి పెడుతోంది. వరంగల్ నగరంలోని  కాశిబుగ్గలో ఓ జర్నలిస్టు కుటుంబం ఇంటి యజమానిని కరోనా కబలించడంతో ఆ కుటుంబం దిక్కు లేనిదయింది. రుద్రోజు నాగరాజు ఇటీవల కరోనా తో మృతి చెందాడు. వయోభారంతో ఉన్న తల్లి, బార్య, కూతురుతో పాటు ఓ చెల్లి కూడ ఉన్న నాగరాజు కుటుంబానికి స్వంత ఇళ్లు లేదు. నాగరాజు మృతి తర్వాత వారు కిరాయికి  ఉంటున్న ఓనరు ఇంట్లోకి రావద్దని అభ్యంతరం చెప్పాడు. ఎవరూ ఆశ్రయం ఇవ్వరని అర్దం చేసుకున్న ఆ కుటుంబం వరంగల్ స్టేషన్ రోడ్ లో ఉన్న ఓ లాడ్జిలో ఉంటున్నారు. ఈ విషయం తెల్సిన దాతలు వారిని ఆదుకునేందుకు మందుకు వచ్చారు. వరంగల్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆ కుటుంబానికి 10 వేల ఆర్థిక సహాయం అంద చేసాడు.  కొందరు జర్నలిస్టులతో పాటు ఇతరులు ఆ కుటంబానికి సహాయంగా నిలిచారు. 

మానవతా ధృక్పథధంతో సహాయం చేసేందుకు ముందుకువచ్చే  దాతలు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా  రుద్రోజు నాగరాజు పేరిట ఉన్న  8341943076  నెంబర్ కు పంపించి మెసేజ్ ద్వారా తెలియ చేయగలరు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు