కోవిడ్ చికిత్స కేంద్రంలో ఘోరం -అగ్ని ప్రమాదంలో 18 మంది మృతి

 


కొవిడ్‌ చికిత్స కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించి 18 మంది మృతిచెందారు. ఈ దుర్ఘటన గుజరాత్‌ రాష్ట్రం లోని భరూచ్‌లోని కొవిడ్‌ సంరక్షణ కేంద్రంలో

శనివారం తెల్లవారుజామున జరిగింది.
ఘోర అగ్నిప్రమాదంలో 18 మంది రోగులు దుర్మరణం చెందారు. వెల్ఫేర్ ఆసుపత్రిలో మంటలు చెలరేగగానే స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి 50మంది కొవిడ్ రోగులను రక్షించారు.అగ్నిప్రమాదం వల్ల 18 మంది రోగులు మరణించారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భారుచ్ జిల్లా ఎస్పీ రాజేంద్ర సింహ్ చూదాసమా చెప్పారు.

భారుచ్ -జంబూసర్ జాతీయ రహదారిపై ఉన్న నాలుగు అంతస్తుల ఆసుపత్రిని ఓ ట్రస్టు నిర్వహిస్తోంది. గ్రౌండు ఫ్లోరులో తెల్లవారుజామున మంటలు అంటుకున్నాయని అగ్నిమాపక శాఖ అధికారి శైలేష్ సనాసియా చెప్పారు.అగ్నిప్రమాదం జరిగిన వెంటనే గంటలోపల మంటలను అదుపు చేశామని, 50 మంది రోగులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని అగ్నిమాపకశాఖ అధికారులు చెప్పారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు