హైకోర్టులో ఈటెలకు ఊరట- కెసిఆర్ సర్కార్ జులుం చెల్లదన్న కోర్టు

సర్కార్ తీరును తప్పు పట్టిన హై కోర్టు - నోటీసులు ఇవ్వకుండా సర్వేలేంటన్న కోర్టు
వెనక గెటు నుండి కాకుండా రాజమార్గంలో వెళ్లాలన్న కోర్టు


మాజి మంత్రి ఈటెల రాజేందర్ పై ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయ కక్ష సాధింపు చర్యలను సామాన్య ప్రజానీకమే కాదు కోర్టుస కూడ తప్పు పట్టింది. ఈటెరల రాజేందర్ భూకకబ్జాలకు పాల్పడ్డాడని ఎకాఎకిన అధికారులను పరుగులెత్తించి సర్వే చేయించి కబ్జా జగిందని నిర్దారించారు. దీన్నిసవాల్ చేస్తు ఈటెల రాజేందర్ సతీమని జమున, ఆయన కుమారుడు నితిన్ రెడ్డి హై కోర్టులో సవాల్ చేశారు. జమున హేచరీస్ సంస్థ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినోద్ కుమార్ విచారణ జరిపారు.

మంగళవారం కేసు విచారణ చేపట్టిన హై కోర్టు తెలంగాణ సర్కార్ తీరును తప్పు పట్టింది.  ఇప్పటి వరకు జరిగిన విచారణ సికాదని దాన్ని పరిగణ లోకి తీసుకో రాదని ఆదేశించింది.  జమున హేచరీస్ కు ముందస్తు నోటీసు ఇవ్వక పోవడాన్ని తప్పు పట్టింది.  అఁతే కాదు జమున హాచరీస్ భూములు, వ్యాపారాల్లో జోక్యం చేసుకో రాదంటూ మద్యంతర ఉత్తర్వులు జారి చేసింది. మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వెనుక గేటు నుంచి కాకుండా రాజమార్గంలో వెళ్లి విచారణ చేయాలని సూచన చేసింది. శుక్రవారం విచారణ ప్రారంభించి శనివారంలోగా నివేదిక ఇవ్వాలని తాము కోరుకోవడం లేదని, పూర్తిగా సమగ్ర దర్యాప్తు చేసి తమకు అందించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను జూలై 6 కి వాయిదా వేసింది.

కేసుకు సంభందించి అధికారులకు, ప్రతివాదులకు హై కోర్టు నోటీసులు  జారి చేసింది. అట్లాగే సమగ్ర విచారణతో కొంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హై కోర్టు ఆదేశించింది.

హై కోర్టు తీర్పుతో తెలంగాణ సర్కార్ కు ప్రధానంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. తన కాబినెట్ లో సహచర మంత్రి అని కూడ చూడకుండా అధికార జులుం ప్రదర్శించి పదవి నుండి బర్తరఫ్ చేయడం మే కాకుండా అరెస్టు చేస్తారంటూ పుకార్లు పుట్టించారు.  అధికారులు కూడ విచారణ ప్రక్రియలో చట్టాన్ని నిబందనలు ఉల్లంఘించి ఎలాంటి ముందస్తు నోటీసులు జారి చేయకుండా కెసిఆర్ ఆదేశాలు పాటించి కోర్టు ముందు దోషులయ్యారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు