తెలంగాణ లో ఆయుష్మాన్ భారత్ - కరోనా పేషెంట్లకు వరం

 కరోనా భాదితులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇక ఉచిత చికిత్స  పొంద వచ్చు  


కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ - ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన  పథకంలో తెలంగాణ చేరింది. సిఎం కెసిఆర్ ఆదేశాలతో  రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా భాదితులు ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చు.  ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు విధి విధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారు చేసింది. దీని ప్రకారం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలు అందించాలని తెలంగాణ వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కెసీఆర్ ఆదేశించారు. ఈమేరకు, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ ఎ రిజ్వీ, రాష్ట్ర ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈవో కు అమలుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.

కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పరిదిలోకి తేవాలని ప్రతిపక్షాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడ డిమాండ్ చేసిన నేపద్యంలో సిఎం కెసిఆర్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన పథకం అమలు చేయాలని నిర్ణయించాడు. రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ విధివిధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖరారు చేసింది. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టు సీఈవోకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ మెమో జారీ చేశారు.

ఆయుష్మాన్‌ భారత్ పథకాన్ని 2018 సెప్టెంబర్‌లో రాంచీలో ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు.  తెలంగాణ లో తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఆరోగ్య శ్రీ సేవలు లభిస్తున్నాయి.   ఆయుష్మాన్ భారత్ పథకం కింద పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5లక్షల వరకు ఉచితంగా చికిత్స అందించనున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు