తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఐఏఎస్

 ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్

తెలంగాణ విద్యావేత్తలకు గొడ్డు బోయిందా ?
బి జనార్దన్ రెడ్డిని చైర్మన్ గా నియమించిన కెసిఆర్ 

 


కొద్ది కాలంగా ఖాళీగా ఉన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్  కమీషన్ పదవులను సిఎం కెసిఆర్ భర్తి చేసారు. ఈ సారి ఉన్నత విద్యాధికులను కాదని  ఐఏఎస్ అధికారికి చైర్మన్ పదవి కట్టబెట్టడం అందరిని విస్మయ పరిచింది.  చైర్మన్ గా ఐఏఎస్ అధికారి బి జనార్దన్ రెడ్డిని నియమించారు. జనార్ద న్ రెడ్డి గతంలో పలు శాఖల్లో పనిచేసారు.ప్రస్తుతం వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆయనతో పాటు మరో ఏడుగురిని సభ్యులుగా నియమించారు. రిటైర్ అయినప్పటి నుండి ఏదో ఒక పదవి కోసం ఆశతో ఎదురు చూస్తున్న టిఎన్ జివో సంఘం రాష్ట్ర మాజి అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి ని సబ్యుల్లో ఒకరిగా నియమించారు. ఆయనతో పాటుగా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రమావత్ ధన్ సింగ్, ప్రొఫెసర్ బి.లింగా రెడ్డి, కోట్ల అరుణ కుమారి,  సుమిత్ర ఆనంద్, డాక్టర్ అరవెల్లి చంద్రశేఖర్ రావు, ఆర్ సత్యనారాయణ (జర్నలిస్ట్) నియమితులు అయ్యారు.

పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ పదవిని విద్యావేత్తలకు ఇస్తే గౌరవంగా ఉండేది. ఎవరికి ఇవ్వాలనేది సిఎం కెసిఆర్ ఇష్టం కాని తెలంగాణ పట్ల  ఓ విజన్ ఉండే విద్యాధికులకు ఇస్తే   నిరుద్యోగులకు మేలు జరిగే పరిస్థితులు ఉండేవి. ఎస్ అంటే ఎస్ నో అంటే  నో అనే ఐఏఎస్ లకు ఈ చైర్మన్ పదవి ఇవ్వడం చూస్తే సర్వ స్వతంత్రంగా పనిచేయాల్సిన పబ్లిక్ సర్వీస్ కమీషన్ ను  సిఎం తన చెప్పు చేతల్లో పెట్టు కోవాలన్న ఉద్దేశం కనిపిస్తోంది.

గతంలో ఆంధ్ర పాలకులు ఇలాగే ఐఏఎస్ లకు ,ఐపీఎస్ లకు ఈ పదవులు కట్ట బెట్టి వాటికుండే గౌరవాన్ని నాశనం చేశారు. పూర్తిగా కరప్షన్ కమీషన్ గా మార్చారు.

తెలంగాణ లో విద్యాధికులు అనేక మంది ఉన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ పదవి ఆశించిన వారందరిని కాదని సిఎం  ఐఏఎస్ అధికారిని చైర్మన్ గా నియమించడం చూస్తే ఆయన ఉద్దేశం ఏమిటో అర్దం చేసుకోవచ్చు.  తెలంగాణ రాష్ట్రం  విద్యాధికులకు గొడ్డు బోయినట్లు ఐఏఎస్ బాబును చైర్మన్ కుర్చీలో కూర్చో బెట్టడం చూస్తే సిఎం కెసిఆర్ కు తెలంగాణ పట్ల ఉండే చిత్త శుద్ది ఏపాటిదో అర్దం చేసుకోవచ్చు. ఆయనకు మొదటి నుండి మేధావులన్నా విద్యా వేత్తలన్నా చులకన భావం అని చెబుతారు. ఎందరో విద్యా వేత్తలు తెలంగాణ ఉద్యమంలో తమ జీవితాలను ధార పోసిన వారున్నారు. అలాంటి వారిని కాదని ఐఏఎస్ బాబును చైర్మన్ గా నియమించడం ఖచ్చితంగా తెలంగాణ విద్యాధికులను అవమాన పరచడమే అవుతుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తొలి సర్వీస్ కమీషన్ కు తెలంగాణ వాది విద్యాధికుడు  ఘంటా  చక్రపాణిని  చైర్మన్ గా నియమించారు. వివాదాలకు అతీతంగా ఘంటా చక్రపాణి పనిచేసారు.  ప్రగతి శీల భావాలున్న వారంటే సిఎం కెసిఆర్ కు నచ్చక పోవడం వల్లే  ఘంటా చక్రపాణికి ఆ తర్వాత  కెసిఆర్ ప్రాముఖ్యత నివ్వలేదన్న విమర్శలు ఉన్నాయి.

తెలంగాణ లో వేలాది ఉద్యోగాలు భర్తి చేయాల్సి ఉంది.  ఉప ఎన్నికల సమయంలో తక్షణం 50 వేల ఉద్యోగాలు భర్తి చేస్తామని ప్రకటించిన కెసిఆర్ ఆ తర్వాత వాటి ఊసే ఎత్తలేదు. ఉప ఎన్నికలు, ఎమ్మెల్సి ఎన్నికల్లో తక్షణం ఉద్యోగాలు భర్తి చేస్తామని చెప్పి 100 రోజులు దాటింది.

నాలుగు వారాల్లో టిఎస్ పి ఎస్ సి చైర్మన్ పదవిని నియమించాలని ఇటీవల రాష్ట్ర హై కోర్టు ఆ దేశించింది.

కమీషన్ సబ్యులు లేక పోవడం వల్ల ప్రక్రియలో జాప్యం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు అధికారులను ఇన్ చార్జీలుగా నియమించి భ్రష్టు పట్టించారన్న విమర్శలు ఉన్నాయి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు