జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు ప్రారంభం


కరోనా కష్టకాలంలో భాదితులను ఎంతగా ఆదుకుంటే అంతగా పుణ్యం చేసుకున్నట్లే. రాజమండ్రి ఎంపి భరత్ వినూతన ఆలోచనతో బస్సులో కోవిడ్ పేషెంట్ల కోసం ఆక్సీజన్ తో కూడన బెడ్లను ఏర్పాటు చేసాడు. దీనికి జగనన్న ప్రాణ వాయువు రథ చక్రాలంటూ నామకరణం చేేశాడు. 

రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఈ వాహాలను  ఎంపీ మార్గాని భరత్‌ గురువారం ప్రారంభించారు. మొదటిసారిగా రాజమహేంద్రవరంలో కోవిడ్‌ బాధితులకు బస్సులో వైద్యమందించాలని నిర్ణయించారు.  విధానం విజయవంతమైతే ఎంపీ భరత్‌రామ్‌ దీన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు. 36 సీట్లు సామర్థ్యం గల ఈ బస్సులో ఆరు పడకలను ఏర్పాటు చేశారు.

రెండు బస్సులను సిద్ధం చేయగా వాటిలో మొత్తం 12 బెడ్లు అందుబాటులో ఉంటాయి. వీటికి ఆక్సిజన్‌ సదుపాయం ఏర్పాటు చేసి మినీ ఐసీయూలా తయారుచేశారు. ఆసుపత్రిలో బెడ్‌ లేక ఆక్సిజన్‌ అందక ఇబ్బందులు పడేవారికి బెడ్‌ దొరికేవరకు ఈ బస్సులో ఉంచి ఆక్సిజన్‌ అందించనున్నారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ గ్యారేజ్‌లోంచి రెండు వెన్నెల బస్‌లను ఈ సేవలకు వినియోగిస్తున్నారు. చాలామంది ఆక్సిజన్‌ అందక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు రూపకల్పన చేసినట్టు ఎంపీ భరత్‌రామ్‌ తెలిపారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు