వరంగల్ ఎంజిఎంకు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందించిన ఆటా

 అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఉదారత్వం


అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అధ్వర్యంలో వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి కరోనా భాదితుల కోసం 12 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ యూనిట్లను అంద చేసారు.జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధి హన్మంతు, ఆసుపత్రి సూపరింటిండెంట్ చంద్రశేఖర్ లకు ఆటా ప్రతినిధులు యూనిట్లను అంద చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో విపత్తలు సమయంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆటా ఈ సారి కరోనా మహమ్మారి కట్టడి కోసం భాదితులకు సహాయం చేసేందుకు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను సహాయంగా అంద చేసిందని ఇండిాలో ఆటా అడ్వైజర్ సీనియర్ నటుడు లోహిత్ కుమార్, ఉమెన్ కోఆర్డినేటర్ బొబ్బల జోస్న రెడ్డి, శ్రీనివాస్ బండారి,  నవీన్ లు తెలిపారు. ఆటా అధ్యక్షులు భువనేశ్వర్ భుజాల, కోల్డ్ రిలీఫ్ చైర్మన్ అనిల్ బుద్ధి రెడ్డి, సుధీర్ రెడ్డి ల ఆధ్వర్యంలో ఈ సహాయం చేశామని తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచన మేరకు అమెరికాలోని ఆటా ప్రతినిధులు  మొదటి విడతగా ఈ ఆక్సిజన్ యూనిట్లను సమకూర్చారని రెండో విడత ఎక్కువ మొత్తంలో యూనిట్లు సమకూరుస్తామని ఆటా ఉమెన్ కోఆర్డినేయర్  బొబ్బల జోస్న రెడ్డి తెలిపారు. 

కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు ప్రభుత్వ పరంగా అన్ని  ప్రయత్నాలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజీవవ్  గాంధి హన్మంతు తెలిపారు. విపత్కర పరిస్థితిలో అటా ఆక్సిజన్ యూనిట్లు సహాయం చేయడం అభినందనీయమని అన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా భాదితుల కోసం 24 గంటలు శ్రమిస్తున్నారని అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు