ఎపి వైరస్ యమ డేంజర్

 


ఎపిలో బయట పడిన కొత్త వైరస్ వేరియంట్ .మ డేంజర్ అని నిపుణులు హెచ్చరించారు. ఈ వైరస్ కు గత వేరియంట్ల కన్నా తీవ్రతలో 15 రెట్లు ఎక్కువ ప్రమాదకరమని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజి శాస్ర్త వేత్తలు గుర్తించారు ఎన్ 440 కె గా పిలిచే ఈ వేరియంట్ ఎక్కువగా రాష్ర్టంలో నివిశాఖపట్నం, విజయనగరంలో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నప్పటకి మొదటి దీన్ని కర్నూలు జిల్లాలో కనుగున్నారు. ఈ వైరస్ ను ఎపి స్ట్రెయిన్ గా పిలుస్తున్నారు.

ఈ  వైరస్ పై ఇంకా పూర్తి అధ్యయనాలు జరగాలని శాస్ర్త వేత్తలు చెబుతున్నారు. భారతీయ వేరియంట్ B1.617, B1.618 వేరియంట్ల కంటే ప్రమాదకరం అయినా ఇప్పటి వాక్సిన్లకు లొంగుతుందా లేదా అనేది శాస్ర్త వేత్తలు నిర్దారించాల్సి ఉంది. గత ఏడాది ఎపిలో చూసిన వేరియంట్స్ కన్నా ఇది భిన్నమైందని నిపుణులు అంటున్నారు. ఈ వేరియంట్ సోకిన వారిలో  ఒకటి రెండు రోజుల్లో తీవ్రమైన ఆనారోగ్య లక్షణాలు కనిపిస్తున్నాయి.  అంతే కాకుండా ఒకరి నుండి ఒకరికి  వ్యాప్తి చెందే ప్రభావం కూడ వేగంగా  ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారు హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందడంలో ఉపయోగాలు కనిపించడం లేదు. ఆసుపత్రుల్లో ఐసియు లో ఉంచి ఆక్సిజన్ తో చికిత్స అవసరం అవుతోంది.

ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ నుండి కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సామాజిక దూరం తప్పని సరిగా పాటించాలని అట్లాగే సాని.టైజర్లు, మాస్కులు వినియోగించాలని సీచించారు.

ఎపిలో వైరస్ వీర విహారం చేస్తోంది. గడిచిన 24గంటల వ్యవధిలో 1,15,784 శాంపిల్స్‌ పరీక్షించగా రాష్ట్ర వ్యాప్తంగా 20వేల 034 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ర్టంలో  11 జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. 

రాష్ట్రంలో ఇప్పటి వరకు  11,84,028 కేసులు నమోదు కాగా 8,289 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య  1,59,597 ఉండగా  10,16,142 మంది కోలుకున్నారు.

12 గంటల నుండి కర్ఫ్యూ 

రాష్ర్టంలో కరోనా తీవ్రతను కట్డి చేసేందుకు రెండు వారాల పాటు కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యాహ్నం 12 గంటల వరకే నిత్యావసరాలకు అనుమతులుఇస్తారు. ఆ తర్వాత పూర్తిగా బంద్ పాటించాలి. ప్రజా రవాణా వ్యవస్థ కూడ నిలిచి పోనుంది.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు