కరోనా మెడిసిన్ 2డీజీ ధరఎంతో తెల్సా

ఒక్క సాచెట్ ధర రూ. 990 
రెడ్డీస్ లాబ్ మాజిక్ 


డీఆర్‌డీవో రూపొందించిన కోవిడ్-19 ఔషధం గురించి తెల్సి అందరు సంబర పడిపోయారు. అయితే దీని ధర చూస్తే మాత్రం దిమ్మ తిరిగి పోద్ది. డీఆర్‌డీవో కరోనా మెడిసిన్ 2డీజీ ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా మెడిసిన్ 2డీజీని డాక్టర్ రెడ్డీస్ రూ. 990 కి విక్రయిస్తుంది.  కరోనా బాధితులకు చికిత్స కోసం పొడి రూపంలో ఉండే (2-DG anti-COVID-19 Drug) ఒక్కో సాచెట్ ధర రూ.990గా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నిర్ణయించినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. కరోనాకు ఇప్పటి  వరకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మందులన్ని చాలా ఖరీదైనవే. మన దేశంలో అది తెలంగాణ రాష్ర్టంలో కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన డీఆర్‌డీవో రొపొందించడంతో  ఇది అందరికి అందుబాటు ధరలో లభిస్తుందని ఆశించారు. కాని రెడ్డీస్ లాబరేటరీస్ చేతుల్లో పడి ఈ మందు ధర 10 రూపాయలు  తక్కువ వెయ్యు రూపాయలకు నిర్ణయించడం చూస్తే ధర నిర్ణయం వెనకాల కార్పోరేట్ మాయా జాలం లాబీయింగ్ ఎంతగా పనిచేసిందో అర్దం చేసుకోవచ్చు.  ఏదైనా కరోనాతో పోరాడాందుుక బారత దేశంలో మరో ఔషధం అందుబాటులోకి వచ్చిందని సంతోష పడాలి తప్పదు. ఎందుకంటే మందు లేని కరోనాకు అనేక మంది బలై పోతున్నారు. ప్రైవేట్ కార్పోరేట్ ఆసుపత్రుల్లో అయితే లక్షలాది రూపాయలు వ్యయం అవుతున్నా కరోనా రోగుల ప్రాణాలు నిలవడం లేదు. కార్పోరేట్ ఆసుపత్రుల్లో దోపిడి జరుగుతోంది.   ఈ ఔషధాన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగ్గింపు ధరలకు అందించనున్నట్లు సమాచారం. భారత్‌లో ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆక్సిజన్ కొరత సమస్యకు ఈ ఔషధం కొంతమేర పరిష్కారాన్ని చూపించనుందని  నిపుణులు చెబుతున్నారు. పౌడర్ రూపంలో ఉండే ఈ కరోనా మెడిసన్ వాడితే ఆక్సిజన్‌తో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులు త్వరగా కోలుకుంటారని చెప్పారు.

భారత్‌లో ఇదివరకే కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి. కరోనాపై పోరాటంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తో కలిసి డీఆర్‌డీవో ఈ 2-డియాక్సీ-డి-గ్లూకోజ్ (2-deoxy-D-glucose) యాంటీ కోవిడ్19 ఔషధాన్ని తయారుచేసింది. ఈ మందు ఫలితాలు బాగా ఉంటే రెడ్డీస్ లాబరేటరీస్ కు డబ్బే డబ్బు. త్వరలోనే  ప్రపంచ కుబేరుల జాబితాలో చేరిపోయినా అశ్చర్యం లేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు