ఎన్నికల కమీషన్ అధికారులకు ఏ శిక్ష విధించినా తప్పు లేదు

 కరోనా ఉధృతికి ఎన్నికలే కారణం


రాష్ట్రంలో ఎన్నికల కమీషన్ చేసిన తప్పు అంతా ఇంతా కాదు.ఎన్నికల  కమీషన్ అధికారులకు ఏ శిక్ష విధించినా తప్పు లేదు. వేలాది మంది కరోనా భారిన పడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయేందుకు కారణమయ్యారు. ఇప్పుడు ఎంతగా ఛీవాట్లు పెట్టినా నిష్ప్రయోజనం తప్ప పోయిన ప్రాణాలు తిరిగి రావు. గురువారం తెలంగాణ హై కోర్టు ఎన్నికల కమీషన్ ను ఛీవాట్లు పెట్టింది. యుద్ధం వచ్చినా.. ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాలా? అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లారంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఫిబ్రవరిలో కోవిడ్ రెండో దశ మొదలైతే.. ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఎందుకిచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు అత్యంత బాధాకరంగా ఉందని హైకోర్టు పేర్కొంది. ఎన్నికల సంఘం పనితీరు సరిగా లేదని  కరోనా విపత్తులో ఎన్నికలు వాయిదా వేయకుండా ముందుకెళ్లడం బాధాకరమని విచారం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఏకాభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్‌ఈసీ వివరణ  ఇవ్వడం గమనార్హం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నికల కమీషన్ స్వయంప్రతి పత్తి కలిగిన సంస్థ కాని రాష్ట్ర ప్రభుత్వానికి జీ హుజూరంటూ పనిచేసింది. 

ఎన్నికల కమీషన్ పై రాష్ర్ట ప్రభుత్వ ఇన్ ఫ్లూయెన్సు స్పష్టంగా కనిపించింది. దుబ్బాక, హైదరాబాద్ ఎన్నికల్లో అధికార టిఆర్ పార్టీకి ఓటర్లు వ్యతిరేక తీర్పు ఇచ్చినా ఆ తర్వాత ఎమ్మెల్సి ఎన్నికల నాటికి పరిస్థితులు మారాయి. ఎమ్మెల్సి ఎన్నికల్లో రెండుకు రెండూ టిఆర్ఎస్ ఖాతాల్లో జమ అయ్యాయి. ఓటర్ల మూడ్ అధికార పార్టీకి అనుకూలంగా ఉందని  ఇదే పరిస్థితిలో మున్సిపల్  ఎన్నికలకు తొందరపడింది. అధికార పార్టి ప్రతిపాదనలకు ఎన్నికల కమీషన్ ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.  షెడ్యూల్ అనౌన్స్ అయిన నాటికే రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉనికిలో ఉంది. అయినా గ్రౌండ్ రియాలిటి పట్టించుకున్న పాపాన పోలేదు.  అధికార యంత్రాంగం అంతా కరోనా విపత్కర పరిస్థితులలో ప్రజలను ఆదుకునే పరిస్థితి లేకుండా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు సమయం వెచ్చించాల్సి వచ్చింది. ఎన్నికల నిర్వహణలో వేలాది మంది  ప్రబుత్వ ఉద్యోగులు పనిచేయాలి. లక్షలాది మంది ఓటర్లు పోలింగ్ బూతులకు వచ్చి ఓట్లు వేయాలి. ఈ పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి ఇంకా పెరిగి పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.. 

రాష్ట్రంలో  కరోనా ఉధృతిలో మున్సి పాల్టి ఎన్నికలు నిర్వహించడం ముమ్మాటికి ఎన్నికల కమీషన్ తప్పు. అధికార పార్టి ఇన్ ఫ్లూయెన్సులో పడి పోయి ఎన్నికల కమీషన్ ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టింది

దేశంలో పలురాష్ట్రాలలో కూడ ఇదే పరస్థితి నెల కొంది. అందుకే మద్రాస్ హై కోర్టు  ఎన్నికల కమీషన్ కు తప్పు పడుతూ తీవ్ర వ్యాఖ్యులు చేసింది. అలహాబాద్ హై కోర్టు ఎన్నికల కమీషన్ కు నోటీసులు జారి చేసింది. పంచాయితి ఎన్నికల్లో 135 మంది ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బంది కరోనా తో చనిపోయారు. చనిపోయిన ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగానే ఉందని ఉపాధ్యాయ సంఘాలు  చెబుతున్నాయి. మొత్తం 71 జిల్లాల్లో 577 మంది ఉపాధ్యాయులు మృత్యువాత పడ్డారని నివేదికలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు