లంచంగా తీసుకున్న కరెన్సీని తగల బెట్టాడు

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో జరిగిన సంఘటన
రెడ్ హాండెడ్ గా పట్టుకున్న  ఎసిబి అధికారులు


 రాజస్థాన్ లో ఎసిబి దాడుల సందర్భంగా కరెన్సీని  దగ్దం చేసిన తహశీల్ దార్  తరహా వ్యవహారం తెలంగాణ లో  కూడ జరిగింది. తహశీల్ దార్ తరపున లంచంగా తీసుకున్న కరెన్సీని తగల బెట్టాడో వ్యక్తి.                   

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో మాజీ మండల ఉపాధ్యక్షుడు వెంకటయ్య గౌడ్ ఏకంగా రూ.5 లక్షల నగదును తగల బెట్టేశాడు. ఇవన్నీ కొత్త నోట్లే కావడం గమనార్హం.  తాను చేసిన అక్రమాన్ని కప్పిపుచ్చు కొనేందుకు ప్రయత్నించినా అతనికి ఫలితం లేకుండా పోయింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల కేంద్రంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. వెంకటయ్య గౌడ్ తహశీల్ దార్ తరపున 5 లక్షల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడి చేశారు. దాంతో ఆయన 5 లక్షల కరెన్సీని మాయం చేసేందుకు వాటిని దగ్దం చేశాడు. తలుపులు మూసి... నగదును గ్యాస్ స్టౌపై కాల్చేశారు. ఏసీబీ అధికారులు బలవంతంగా తలుపులు తెరిచే లోపు 70 శాతం నోట్లు కాలిపోయాయి

ఎసిబి అధికారులు అది చూసి షాక్ అయ్యారు. వెంటనే మంటలు ఆర్పి సగం కాలిన కరెన్సి నోట్లను స్వాదీనం చేసుకున్నారు.  

వెల్దండ తహశీల్ దార్ సైదులు గౌడ్ తరపున ఈ లంచం తీసుకున్నట్లు ఎసిబి అధికారుల విచారణలో వెలుగు చూసింది. రాములు నాయక్ అనే వ్యక్తి  మైనింగ్ తవ్వకం కోసం ఎన్ ఓసి ఇవ్వాలని తహసీల్ దార్ ను సంప్రదించాడు. రాములు నాయక్ నుంచి నుంచి 5 లక్షలు డిమాండ్ చేసిన తహశీల్ దార్ ఆ డబ్బును వెంకటయ్య గౌడ్ కు ఇవ్వాలని సూచించాడు. దాంతో భాదితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. నగదును ఇస్తుండగా ఎసిబి అధికారులు రావడంతో వెంకటయ్య గౌడ్ వాటిని తగల పెట్టాడు. జిల్లెల గూడ, వెల్దండ మండలం చెదురుపల్లిలోని వెంకటయ్య గౌడ్‌కు చెందిన  ఇండ్ల లోను అట్లాగే హైదరాబాద్ లోని ఎల్ బి నగర్ లో  తహశీల్ దార్ ఇంట్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించి నగదు బంగారు ఆభరణాలు స్వాదినం చేసుకున్నారు. తహశీల్  దార్ తో పాటు  వెంకటయ్య గౌడ్ ను ఎసిబి అధికారులు అరెస్ట్ చేసారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు