కరోనా వాక్సిన్ కు బదులు రేబిస్ టీకా - ముగ్గురు మహిళలకు అస్వస్తత

 ఉత్తర ప్రదేశ్ లో రెండో సారి జరిగిన ఘోరం
కరోనా వాక్సిన్ ఇస్తున్న హెల్త్ సెంటర్లలో ఎంతగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఈ సంఘటనలు అద్దం పడుతున్నాయి


యోగి ఆదిత్యానాధ్ దాస్ ముఖ్యమంత్రిగా ఉన్న  ఉత్తర ప్రదేశ్ లో ఆ మద్య కరోనా వాక్సిన్ డబుల్ డోసు ఇచ్చి నర్సు వార్తల్లో కెక్కారు. అదే రాష్ర్టంలో మరో సారి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో వ్యవహరించి మరో సారి వార్తల్లోకి ఎక్కారు. ఎంత ఘోరమంటే వాక్సిన్ తీసుకునేందుకు హెల్త్ సెంటర్ కు వెళ్లిన ముగ్గురు మహిళలకు అక్కడి సిబ్బంది కోవిడ్ వ్యాక్సిన్‌కు బదులుగా రేబిస్‌ టీకా ఇచ్చారు . పాపం ఆ మహిళలకు వారు తీసుకున్నది రేబిస్ టీకా అని కూడ తెలియదు.  వారు అనారోగ్యం పాలు కావడంతో ఈ సంఘటన వెలుగు చూసింది.

సత్యవతి (60), సత్యవతి (60),సరోజ్‌ (70) ముగ్గురు మహిళలు షామ్లీ జిల్లాలోని కంధాల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ కు వాక్సిన్ తీసుకునేందుకు ఏప్రిల్ 9న వెళ్లారు. అక్కడి హెల్త్ సెంటర్ సిబ్బంది వారి చేత సిరంజీలు కొనిపించారు. ఆ తర్వాత వారికి రేబిస్ టీకా మందు ఇచ్చి పంపించారు. ముగ్గుుర మహిళలు ఇంటికి వెళ్లిన తర్వాత అనారోగ్య లక్షణాలు బయట పడ్డాయి. ఒళ్లు తిరగడం మత్తులోజోగి నట్లు ఉండటం తూలుతూ ఉండటం వంటి లక్షణాలు కనిపించడంతో కుటుంబ సబ్యులు సరోజ్ అనే మహిళను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు వెళ్ళి వైద్య పరీక్షలు చేయించారు. ఆ వైద్యుడు మహిళను పరీక్షించి రేబిస్ టీకా వేసినట్లు కుటుంబ సబ్యులకు చెప్పాడు. ఆందోళన చెందిన కుటుంబ సబ్యులు హెల్త్ సెంటర్ కు వెళ్లి సిబ్బందిని నిల దీసారు. సిబ్బందిపై తీవ్ర అగ్రహావేశాలు వెల్లగక్కారు. హెల్త్ సెంటర్ సిబ్బందికి అప్పటికి కాని వారు చేసిన పొరపాటు అర్దం కాలేదు. షామ్లీ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ సంజయ్ అగర్వాల్‌కు ముగ్గురు మహిళల కుటుంబ సబ్యులు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ సంఘటనపై అదికారులు విచారణకు ఆదేశాలు జారి చేసారు. అనారోగ్యానికి గురైన మహిళలకు వైద్యం చేయించాలని ఆదేశాలు జారి చేశారు. 

ఈ సంఘటనపై జిల్లా మెజిస్ట్రేట్  జాసిత్ కౌర్ సీరియస్ అయ్యారు. నిర్లక్శ్యంగా వ్యవహరించిన ఫార్మసిస్టును వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారి చేశారు. అయితే ముగ్గురు మహిళలు హెల్త్ సెంటర్ లో ఓ గదికి వెళ్లే బదులు మరో గదికి వెళ్లడంతో  హడావుడిగా బయటకి వెళుతున్న ఫార్మసిస్టు ఓ ప్రైవేట్ వ్యక్తికి  టీకాలువేయమని చెప్పి వెళ్లిందని విచారణలో బయట పడింది. ఇంతగా నిర్లక్ష్యం తగదని విమర్శలు వస్తున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు