హై కోర్టు ఆగ్రహం నేపద్యంలో పోలీసులు గరం గరం - మూతికి మాస్కులు లేకుంటే ఇక అంతే సంగతులు

 

            మాస్కులు ధరించాలని అవేర్ నెస్ కల్పిస్తున్న  వరంగల్ ట్రాఫిక్ పోలీసులు


కరోనా కట్టడి విషయంలో హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపద్యంలో పోలీసులు  ఇక కఠిన చర్యలకు పూనుకోనున్నారు. కరోనా నియంత్రణకు విధించిన నిభందనల్లో ఓ ఒక్కటి పాటించక పోయినా  ముఖాలకు మాస్కులు ధరించక పోయినా బుక్ అయిపోవడం ఖాయం. కరోనా  నియంత్రణ పై విచారణ జరిపిన  హై కోర్టు  గురువారం పలు కీలక ఆదేశాలు జారి చేసింది. 

కోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపద్యంలో నిభందనల అమలుకు ఖఠినంగా వ్యవహరించాలని  పోలీసు అధికారులు ఆదేశాలు జారి  చేశారు. ఎవరిని ఉపేక్షించకుండా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.

కరోనా కట్టడి విషయంలో నిపుణులతో సలహా కమిటి ఏర్పాటు చేయాలని హై కోర్టు ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వ్యక్తులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు జరిగితేనే అనుమతించాలని ఆదేశించింది.  కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు 70 శాతం పెంచాలని సూచించింది. మద్యం దుకాణాలు, పబ్‌లు, థియేటర్లలో రద్దీపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

మద్యం దుకాణాలు కరోనా వనరులగా మారాయని హై కోర్టు వ్యాఖ్యానించింది.  ఫంక్షన్‌ హాల్స్‌, మ్యారేజ్ హాల్స్‌ వద్ద ఎక్కువమంది గుమికూడితే అలాంటివారిపై క్రిమినల్ యాక్షన్‌ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాలను మైక్రో కంటోన్మెంట్‌ జోన్స్ కింద ఎందుకు ప్రకటించలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. లాక్‌డౌన్‌ లేకపోయినా.. కంటైన్‌మెంట్‌ జోన్లు కచ్చితంగా ఉండాలని సూచించింది. కరోనా వ్యాక్సిన్ ఎంత వచ్చింది ఎంత వినియోగం జరిగింది ఎంత వేస్ట్ అయింది  వివరాలు తెలపాలని ఆదేశించింది.

కరోనా మార్గదర్శకాల అమలుపై డీజీపీ సమర్పించిన నివేదిక పై హై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా నిభందనలు ఉల్లంఘించిన వారిపై రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల కోసులు నమోదు చేశామని డిజిపి నివేదికలో తెలిపారు. అట్లాగే సామాజిక దూరం పాటించని వారిపై  2,416 కేసులు నమోదు చేసామని  రోడ్లపై ఉమ్మి వేసిన వారిపై 6 కేసులు నమోదు చేశామని నివేదికలో వివరించారు.

నిబంధనలు పాటించని వారిపై చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 1.16లక్షల మందికే  జరిమానానా? అని హైకోర్టు ప్రశ్నించింది. పాతబస్తీ ప్రాంతంలో రెండ్రోజులు తనిఖీ చేస్తే లక్ష మంది దొరుకుతారని వ్యాఖ్యానించింది. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు