రాజ్యాధి కారం అంతిమ లక్ష్యంగా బహుజన సమీకరణలు

 101 మంది మేధావులుఉద్యమకారులతో సామాజిక న్యాయ మేధోమధనం సదస్సు


ఆజాదీ కా అమృత్ మహోత్సవం పేరుతో కేెంద్ర ప్రభుత్వం ఓ వైపు అధికారిక ఉత్సవాలు తల పెడితే దళిత బహుజనులు మరోవైపు 75 ఏండ్ల స్వాతంత్ర ఫలితాలపై పోస్టు మార్టం నిర్వహించారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈ సదస్సులో  ముఖ్య అతిథిగా పాల్గొని కీలకోపాన్యాసం చేశారు.

తెలంగాణ రాష్ట్రం సాకారం అయినంక తెలంగాణ ప్రజల ఆలోచనా ధృక్కోణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో తామెక్కడున్నామో ఉనికిని గుర్తెరిగి భవిష్యత్ కార్యాచరణ ఎజెండా ఎట్లా ఉండాలో పురోగమించేందుకు అడుగులు వేస్తున్నారు.

ప్రధానంగా పాలిటిక్స్ సెంట్రిక్ గా అంబేద్కర్ నిర్దేశించిన మార్గం లో పూలే ఆలోచనా విధానాలతో మెజార్టీ  సెక్షన్లు అయిన దళిత బహుజన విద్యాధికులు, మేధావులు, బుద్దిజీవులు రాజ్యాధి కారం అంతిమ లక్ష్యంగా కొత్త  రాజకీయ  సమీకరణకు  శ్రీ కారం చుట్టారు.

హైదరాబాద్ నడి బొడ్డులో లక్డీకాపూల్ హోటెల్ సెంట్రల్ కోర్టులో జరిగిన సదస్సు మీడియాను షర్మిల దీక్ష ఆకర్షించినంతగా ఆకర్షించ లేక పోవచ్చు. కాని ఈ సదస్సులో జరిగిన మేధో మధనం లో 75 సంవత్సరాల స్వాతంత్య్ర ఫలితాలపై చర్చ జరిగింది. సంపద, అధికారం ఎవరి చేతుల్లో కేంద్రీకృత మైందో అధికారం ఎవరి చేతుల్లో ఉండాల్సింది ఎవరి చేతుల్లో బంది అయిందో విశ్లే షించారు. 

ఈ క్రమంలో నే హైదరాబాద్ లో అదివారం (17 ఏప్రిల్ 2021) న సామాజిక తెలంగాణ జేఏసి అధ్వర్యంలో 101 మంది మేధావులు, ఉద్యమకారులతో సామాజిక న్యాయ మేధోమధనం సదస్సు జరిగింది.

ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ప్రొఫెసర్ మురళి మనోహర్ తో సహా ప్రొఫెసర్ బాల బోయిన సుదర్శన్, ప్రొఫెసర్ గుమ్మడి ఉనురాధ, డాక్టర్ ఎం ఏ షోయబ్, ప్రొఫెసర్ మురళి దర్శన్, కదిరి కృష్ణ తో పాటు పలువురు వక్తలు  ప్రసంగించారు.

తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలిచి తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యే వరకు నిద్రాహారాలు మాని  తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన ఈటెల రాజేందర్ ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర్యం అనంతరం  దేశంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో చోటు చేసుకున్న పరిణామాల క్రమాన్ని ఎత్తి చూపారు.

ఒకప్పుడు రాజకీయ పార్టీల నేతలు రాజకీయాల్లో ప్రజలకు నిస్వార్దంగా కమిట్ మెంట్ తో పనిచేసి తలలో నాలుకగా నిలిచే వారని కాని నేడు ప్రామాణికతలు మారి పోయాయని  పంచాయితి నుండి పార్లమెంట్ వరకు డబ్బు ప్రధాన భూమిక పోషిస్తోందని అన్నారు.

సంపదంతా కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృత మైందని ఎంత డబ్బు ఉంది ఎంత ఖర్చు చేస్తావంటూ అడుగుతున్నారని ఇవి మంచి పరిణామాలు కాదని అన్నారు. సంపద ఆకలి తీర్చేదిగా ఉండాలన్నారు. సంపద ప్రజలకు నిరుపయోగంగా మారడం శ్రేయష్కరం కాదన్నారు.

సమాజంలో అసమానతలు తగ్గాలని, రిజర్వేషన్ల అవసరం ఉండొద్దని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేర్కొన్నారని, కానీ 75 ఏళ్ళు అయినా ఇంకా ఎస్సీల్లో ఏబీసీడీ వర్గీకరణ, అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు లాంటి డిమాండ్లతో ఉద్యమాలు చేయాల్సి వస్తోందని ఈ పరిణామాల నేపద్యంలో మనం సమాజం అభివృద్ధి చెందుతోందని భావించవ గలమా అంటు ప్రశ్నించారు.

మనిషి, సమాజం ఉన్నంత వరకు వైరుధ్యాలు, అంతరాలు ఉంటాయని, అవి లేనినాడే అందరూ ఆమోదించే సమాజంగా గుర్తించగలమన్నారు. 75 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి సమావేశాలు పెట్టుకునే దుస్థితి కలగడం బాధాకరమన్నారు.

కుటుంబాలను పోషించలేక విషం తాగి చనిపోతున్నారని, ఆకలి బాధలతో తనువు చాలిస్తున్నారని, అంబేద్కర్ ఆశించిన సమాజం ఇది కాదని మంత్రి ఈటెల ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రీకృత ఆర్థిక విధానం ఎప్పటికైనా సమాజానికి ముప్పేనని అన్నారు. సమాజం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించవచ్చుగానీ ఏదో ఒకనాడు ఉద్యమం తప్పదని ఈ ఆర్థిక అసమానతలు బద్దలు అయ్యే రోజులు తప్పవని అన్నారు. అంబేద్కర్ చెప్పినట్లు సమాజంలో అసమానతలు ఉన్నంత వరకు పోరాటాలు ఉంటాయని అన్నారు. రాజ్యాంగాన్ని పూర్తిగా అర్దం చేసుకుని అమలు చేయనందుకే ఈ దుస్థితి ఉందని అన్నారు.

మేధావులు ఉద్యమ కారులు మాట్లాడడాన్ని తాను తప్పు పట్టడం లేదని అన్నారు. మాట్లాడటం అనేది వారికున్న హక్కని పేర్కొన్నారు. తాను ఏ కులాలకు మతాలకు వ్యతిరేకం కాదన్నారు.

ప్రభుత్వం అంటే తల్లి దండ్రి వంటిదని  పేదల పక్షాన నిలవడం ప్రభుత్వ భాద్యతని అన్నారు.

మస్కా కొట్టి మాయ చేసే వాడికన్నా ప్రశ్నించే వాడే గొప్పోడని అన్నారు.

రాజ్యాధికారం లక్ష్యంగా దళిత బహుజనులు పోరాడాలని వక్తలు అన్నారు. అన్ని మౌలిక సమస్యలకు రాజ్యాధికారమే ఏకైక పరిష్కార మార్గమని అన్నారు. ఇందు కోసం బహుజనులు అంతా ఐక్యం కావాలని వక్తలు పిలుపు నిచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు