ఈశ్వర్ పిల్లై గారికి అశ్రు నివాళులతో


ఈశ్వర్ పిల్లై (72) గారు నోమోర్...ఇక ఆయన కంచు కంఠం వినపడదు. హైదరాబాద్ లో ఈ రోజు (29-04-2021) ఉదయం గుండె పోటుతో హఠాన్మరణం చెందాడు. 

ఇండియన్ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ ఎడిషన్ కార్యాలయంలో ఎలక్ట్రానిక్స్ డిపార్ట్ మెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేసి న ప్రతి ఉద్యోగికి ఆయన సుపరిచితుడు. అందరు పిల్లై  గారు అని ఎంతో ఆత్మీయతతో పిలి చేవారు. ఆయన సైతం  అందరిని ఆత్మీయంగా పలకరించే వారు. ఒక సారి పరిచయం అయితే ఎవరిని మరిచి పోని వ్యక్తి.. 

ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటు లోకి రాని కాలంలో 2000 సంవత్సరానికి ముందు ఎంఎస్ డాస్ మోడ్ లో కంప్యూటర్ ద్వారా వార్తలు తీసుకునే వారు. ఎడిషన్ కార్యాలయం నుండి డయల్ చేస్తే మోడెం ద్వారా కనెక్ట్ చేసి వార్తలు పంపాల్సి వచ్చేది. పిల్లై గారు హైదరాబాద్ ఆఫీసు నుండి సిస్టం ద్వారా వార్తలు తెప్పించే  విధులు నిర్వహించే వారు. స్లాట్ పంపాల్సిన సమయానికి జిల్లా కార్యాలయాల్లో లాండ్ లైన్ ఫోన్ మోగేది. స్లాట్ టైం వరకు వార్తలు కంపోజ్ చేయడం ముగించి సిస్టం ను మోడెంకు కనెక్ట్ చేసి ఉంచాలి. లేదంటే పిల్లై గారు లైన్లోకి వచ్చే వారు. 

నేను ఈశ్వర్ పిల్లై ని మాట్లాడుతున్నా అనేవారు. అదేంటి మీరు పేరు చెప్పుకోవాలా మీ కంఠం వింటేనే మాకు తెల్సి పోద్దని జోక్ చేసే వాళ్లం. పిల్లై గారిది కంచు కంఠం. క్రికెట్ అంటే పిచ్చి అబిమాని. అంతకు మించి ఆయన క్రికెట్ స్టాటిస్టిక్స్ నిర్వహించే వారు. రిటైర్ అయిన తర్వాత కూడ ఈశ్వర్ పిల్లై గారు ఆలిండియా రేడియోకు స్టాటిస్టిక్స్ ఇచ్చారు. ప్రపంచ కప్ పోటీలకు ఆయన పనిచేశారు.  ఆల్ ఇండియా రేడియో లో కొన్ని మాచ్ లకు  ఆయన  క్రికెట్ కామెంటేటర్ గా కూడ పని చేసారు. 

ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేసిన వారిని పిల్లై గారు ఏదో ఓ రకంగా వారి ఫోన్ నెంబర్లు సేకరించి తరుచూ పలకరించే వారు.  ఆరు నెలల క్రితం ఓ వెల్ఫేర్ అసోసియేషన్ కూడ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపు కూడ క్రియేట్ చేసారు. ఎవరికి తోచిన విదంగా వారు తలా ఇంత కంట్రిబూట్ చేశారు.  పిల్లై గారు తనకు క్రికెట్ మాచ్ ల  ద్వారా వచ్చిన  రెమ్యునరేషన్  నుండి 10 శాతం వెల్ఫేర్ ఫండ్ కోసం ఇచ్చి గ్రూపులో మెసెజ్ పెట్టే వారు. ఎవరికైనా సహాయం అవసరం వస్తే అంద చేసి సమాచారం ఇచ్చే వారు.  

హఠాత్తుగా ఆయన మరణ వార్త వినాల్సి రావడం చాలా భాదాకరం..రెండేళ్ల క్రితం ఆయన కూతురు అనారోగ్యంతో మరణించారు. కూతురు చనిపోయిన దుఖ్ఖం నుండి దూరం అయ్యేందుకు ఆయనకు చాలా రోజులు పట్టింది. ఈశ్వర్ పిల్లై గారికి అశ్రు నివాళులు...ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్న.

పిల్లై గారి ఆకస్మిక మరణం పట్ల ఆంధ్రప్రభ-ఇండియన్ ఎక్స్ ప్రెస్ వెల్ఫేర్ అసోసియేషన్ కు చెందిన పలువురు సభ్యులు సంతాపం వ్యక్తం చేసారు.

నరేందర్ రెడ్డి..జర్నలిస్టుల సంఘం 

సహోద్యోగుల సంక్షేమం కోసం పరితపించిన వ్యక్తి పిళ్ళై. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు  చేయాలన్న  ఆలోచన ఆయనదే....పిళ్ళై మరణం తీరని లోటు.

కూన మహేందర్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు