తెలంగాణ లో పెరగడమే కాని తగ్గని కరోనా

 


కరోనా కేసులు పెరగడమే కాని తగ్గడం లేదు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,478 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన  హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. గురువారం నాడు ఒకే రోజు ఐదుగురు వ్యక్తుల మృత్యు వాత పడ్డారు.  చికిత్సతో కోలుకుని  ఇండ్లకు చేరిన వారి సంఖ్య 363 కాగా రాష్ర్టంలో ఆక్టివ్ కేసుల సంఖ్య 15,472 కు చేరింది. హోం ఐసోలేషన్ లో 9,674 మంది బాధితులు  ఉన్నారు. హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యదికంగా  402 కేసులు ఉన్నాయి. 

దేశంలో కరోనా పాజిటివ్ కేసు రికవరి శాతం పడి పోవడం మరో వైపు ఆందోళన కలిగిస్తోంది. గతంలో 96-97 శాతంగా ఉన్న రికవరి రేటు ప్రస్తుతం 91.22 శాతానికి త‌గ్గిపోయింద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ స్వయంగా  తెలిపారు. దేశంలో మొత్తం క‌రోనా మృతుల సంఖ్య 1,67,642కు చేరింది. 

ప్రతి రోజూ లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1,31,968 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,30,60,542కు చేరుకుంది. దేశంలో క్రితం రోజు (గురువారం)  780 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం యాక్టివ్‌ సంఖ్య 9,79,608కి చేరుకుంది. కొత్తగా 61,899 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,19,13,292 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మొత్తం 9,43,34,262 వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కేరళ, కర్నాటక, తమిళ నాడు రాష్ట్రాలలో మరణాల సంఖ్య  అధికంగా ఉంది.

కరోనా కేసులు నమోదు కాని జిల్లాలు కూడ దేశంలో ఉన్నాయి. దేశంలోని 149 జిల్లాల్లో ఒక్క క‌రోనా పాజిటివ్ కేసు కూడా న‌మోదు కాలేద‌ు. అదేవిధంగా 8 జిల్లాల్లో గ‌త రెండు వారాలుగా కూడా ఒక్క కేసు కూడ నమోదు కాలేద‌ు.  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు