అమర జవాన్ల కుటుంబాలకు 30 లక్షల చొప్పున సహాయం జగన్

 


ఛత్తీస్‌గఢ్‌ లో మావోయిస్టుల కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు సిఆర్ పిఎఫ్ అమర జవాన్ల కుటుంబాలకు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి  30 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్నారు. అమర జవాన్ల మరణం పట్ల జగన్ మోహన్ మోహన్ రెడ్డి తీవ్ర  ధిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.  వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. కుటుంబాలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టి అధినేత నారా చంద్రబాబు నాయుడు అమర జవాన్ల కటుంబాలకు ప్రగాఢ సానుభూతి  ప్రకటించారు. ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోవడం భాదాకరమని అన్నరు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాను శాఖమూరి మురళీకృష్ణ, విజయనగరం జిల్లా గాజులరేగ గ్రామానికి చెందిన రౌతు జగదీష్ ల అంత్యక్రియలు మంగళవారం అధికారిక లాంచనాలతో జరిగాయి.  మురళి కృష్ణ వివాహం మే నెల 22 న జరగాల్సి  ఉంది. తాను పెండ్లి కోసం పెట్టుకున్న సెలవు మంజూ రైందని  మేనెల 15 న వస్తున్నానంటూ తల్లి దండ్రులు శాఖమూరి రవీంద్రబాబు, విజయకుమారి లకు మురలళి కృష్ణ ఫోన్ చేసి మాట్డాడాడు.  తల్లి దండ్రులతో మాట్లాడిన మూడే రోజే ఆయన మావోయిస్టుల కాల్పుల్లో చనిపోవడం విషాదం.  గత ఏడాది ఆగస్ట్‌ 13న పెండ్లు జరగాల్సి ఉండగా సమీప చుట్టం ఒకరు చనిపోవటంతో పెండ్లి  వాయిదా పడింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు