పోలీసులు చెప్పి నట్లు ఫిర్యాదు రాసాను - నిందితులను మార్చారు - వామన రావు తండ్రి కిషన్ రావు


 న్యాయవాది వామనరావు,నాగమణి హత్యల కేసు విషయంలో  పోలీసులపై వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు ఆరోపణలు చేశారు. ఫిర్యాదు సమయంలో పోలీసులు చెప్పినట్లు ఫిర్యాదు పత్రం రాసానని దాంతో నిందితులను తారు మారు చేశారని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రిషత్ చైర్మన్ పుట్ట మధు తో హత్యలకు పరోక్ష సంభందం ఉందన్నారు. సుపారి ఇచ్చి తన కొడుకు, కోడలిని చంపించారని అన్నారు. ఈ విషయం న్యాయ వాదుల సమక్షంలో పోలీసుల ముందు చెప్పేందుకు సిద్దంగా ఉన్నానని అన్నారు. తన కొడుకుకు గ్రామంలో ఎవరితోను గొడవలు లేవని  పాత గొడవలు ఉన్నట్లు సృష్టించారని అన్నారు. 

పెద్దపల్లి సమీపంలో హత్యకు గురైన వామనరావు, నాగమణి కేసులో పోలీసులు ప్రధాన నిందుతులను  గురువారంనాడు అరెస్టు చేశారు.కుంట శ్రీనివాస్ తో పాటు అక్కపాక కుమార్, శివందుల చిరంజీవిలను పోలీసులు అరెస్టు చేసారు. 

హైకోర్టు న్యాయవాది వామన్ రావును, ఆయన భార్య నాగమణిని నడిరోడ్డు మీద పెద్దపల్లి సమీపంలో నరికి చంపిన విషయం తెలిసిందే. వామన్ రావు దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనుకు కారును, హత్యకు ఉపయోగించిన రెండు కత్తులను బిట్టు శ్రీను సమకూర్చి నట్లు పోలీసులు వెల్లడించారు. బిట్టు శ్రీను పుట్ట మధుకు మేనల్లుడు. పుట్టు మధు తల్లి పేరిట నడిచే ట్రస్ట్ వ్యవహారాలు బిట్టు శ్రీను చూస్తుంటాడు.

వామనరావు దంపతుల హత్యలపై హై  కోర్టు సీరియస్ అయింది. కేసును సుమోటాగా స్వీకరించింది. ఈ హత్యలు ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లేలా చేసాయని  హై కోర్టు వ్యాఖ్యానించింది. హత్యలుజరిగిన సంఘటన స్థలం నుండి పూర్తి సాక్షా ధారాలు  సేకరించాలని ఆదేశించింది.

హత్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోర్టుల విధులు బహిష్కరించిన న్యాయవాదులు ఆందోళన జరిపారు. కేసు విచారణను వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు