వామనరావు దంపతుల హత్యలపై సిబిఐ విచారణ జరిపించాలి - ఉత్తమ్ కుమార్ రెడ్డి

 


న్యాయ వాది వామనరావు  దంపతుల హత్యలపై సిబిఐ విచారణ జరిపించాలని కాంగ్రేస్ పార్టి నేతలు డిమాండ్ చేశారు. టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్ధిళ్ళ శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి  తదితరులు  శుక్రవారం రాష్ట్ర గవర్నర్ ను కలిసారు. పట్టపగలు జరిగిన వామనరావు హత్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ  హత్యల వెనక చాలా పెద్ద కుట్ర ఉందని అధికార పార్టి నేతల హస్తం ఉందని తేలినా పోలీసులు ఆ దిశగా విచారణ జరపడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.  పోలీసులు కావాలనే వామన రావు కేసు తప్పు దోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. శీలం రంగయ్య మృతి కేసులో వామన్‌ రావు దంపతులు హైకోర్టులో కేసు వేయడం పోలీసులకు నచ్చలేదన్నారు.  వామనరావు ప్రజా సమస్యలపై అనేక  న్యాయపరమైన పోరాటాలు చేసారని కాళేశ్వరం ఎత్తి పోతల ప్రాజెక్టు నుండి 4 వేల కోట్ల ఇసుక అక్రమంగా తరలించారని ఇలాంటి అక్రమాలపై వామనరావు న్యాయ పోరాటానికి సిద్దపడుతుండగా హత్యలు చేసారని ఆరోపించారు.  పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ అక్రమ మార్గాల్లో నిధులు సేకరించిన విషయంలో కూడ  వామన రావు అనేక సాక్షాధారాలు సేకరించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సిిఐ విచారాణ జరిపితే కాని నిజా నిజాలువెలుగు చూడవని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తమ విజ్ఞప్తిపై రాష్ట్ర గవర్నర్ సానుకూలంగా స్పందించారని అన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు