ఓ వైపు తరగతులు - మరో వైపు కొత్త రకం కరోనా - ఆందోళనలో తల్లి దండ్రులు

 


కొత్త కరోనా వైరస్ వార్తలతో ఓ వైపు ఆందోళన నెలకొన్న పరిస్థితులలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న  నిర్ణయం విద్యార్థుల తల్లి దండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. బుధవారం నుండి 6,7,8 తరగతుల విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో తరగతులు ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకున్నామని ామె తెలిపారు. అయితే ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తిరిగి పుంజు కుంటున్నాయి. తెలంగాణ పొరుగు రాష్ట్రాలు అయిన మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగు తుండడంతో కరోనా కట్టడి చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర లో వేల సంఖ్యలో నిత్యం కేసులు నమోదు అవుతున్నాయి. కేరళలో కూడ కరోనా కేసుుల ఎక్కువగా నమోదుతు అవుతున్నాయి.  కేరళ నుండి కర్నాటకకు ఉన్న దారులన్ని కర్నాటక ప్రభుత్వం మూసి వేసింది. 

తెలంగాణ లో ఇప్పటి కైతే తాజాగా నమోదు అయ్యే కేసుల  సంఖ్య ఆందోళన కరంగా లేక పోయినా కొత్త రకం స్ట్రెయిన్ కనుగున్నట్లు కేంద్రం వెల్లడించింది. N440K, E484K అనే రెండు రకాల వేరియంట్లను గుర్తించినట్లు  నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మంగళవారం వెల్లడించారు. అయితే ఈ కొత్త రకం  వైరస్ తో కరోనా కేసులు పెరుగుతున్నాయా లేదా అనేది నిర్దారణ జరగాల్సిఉంది.

ఈ పరిస్థితులలో తెలంగాణ లో 6 నుండి 8 వరకు విద్యార్థులకు తరగుతులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం తల్లి దండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే తెలంగాణ లో కరోనా కట్టడి నిభంనలు అన్ని ఎత్తి వేసారు. సినిమా హాళ్లు, బార్లు, హోటెళ్లు ఓపెన్ అయ్యాయి.  నగరాలు, పట్టణాలలో రహ దారులపై  ట్రాఫిక్ సమస్య తీవ్రస కూడ పెరిగింది. చాలా మంది మూతులకు మాస్కులు ధరించకుండా తిరుగుతున్నారు. కొత్త కరోనా వేరియంట్ల ప్రభావం ఎంత అనేది కొద్ది రోజులు వేచి చూస్తే కాని అర్దం కాదు. ఈ పరిస్థితులలో  పాఠశాలలు తిరిగి ప్రారంభించడం అంటే విద్యార్థుల తల్లి దండ్రులలో ఆందోళన నెల కొన కుండా ఎట్లా ఉంటుందనే విషయం కూడ ప్రభుత్వం ఆలోచించ లేదు. 



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు