దేశంలో మొదటి సారిగా ఓ మహిళ ను ఉరి తీయ బోతున్నారు ?

 ప్రేమించిన వాడితో కల్సి స్వంత కుటుంబ సబ్యులనే నరికి చంపిన మహిళ


స్వాతంత్రం అనంతరం మొదటి సారిగా దేశంలో ఓ మహిళను ఉరి తీయ బోతున్నారు.  తాను ప్రేమించిన యువకుడితో పెండ్లికి నిరాకరించారన్న కోపంతో ప్రియుడితో కల్సి  తన స్వంత కుటుంబంలోని ఏడుగురిని హత్యచేసారు.

ఉత్తర ప్రదేశ్ కు చెందిన షబ్నమ్ తన ప్రియుడు  సలీం తో కల్సి ఈ హత్యలకు పాల్పడింది. 

ఉత్తర ప్రదేశ్ లోని  అమ్రోహా ప్రాంతానికి చెందిన షబ్నమ్ ఇంగ్లిష్‌లో జాగ్రఫీలో డబుల్ పిజి చేసింది. విచిత్రం ఏమంటే షబ్నమ్ ప్రేమించిన సలీం ఏడో తరగతి కూడ పాస్ కాలేదు. ఓ కట్టెలమండిలో పనిచేసే వాడు. దాంతో షబ్నమ్ కుటుంబ సబ్యులు సలీం తో పెండ్లికి నిరాకరించారు. దాంతో ఇద్దరూ కల్సి కుటుంబ సబ్యులను హత్య చేసేందుకు ప్లాన్ చేసారు. అమ్రోహా జిల్లా లోని  భావంఖేడ్ గ్రామంలో ఏప్రిల్ 14 వ తేదీన ఇద్దరు కల్సి షబ్నమ్ కుటుంబ సబ్యులను గొడ్డలితో నరికి దారుణంగా చంపేశారు. షబ్నమ్ తల్లి దండ్రులతో పాటు  ఇద్దరు సోదరులు, వారి భార్యలతో పాటు వారి  11 నెలల బాలున్ని కూడ హత్య చేసారు.

షబ్నమ్ రాంపూర్ జైళులో ఉండగా సలీం ప్రయాగ్ రాజ్ లోని  నాయిని  సెంట్రల్ జైళులో ఉన్నాడు. 

ఈ కేసులో షబ్నమ్, సలీం లను దోషులుగా తేల్చిన స్థానిక కోర్టు మరణ శిక్ష ఖరారు చేసింది.  హైకోర్టు, సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకున్నా వారికి పై కోర్టుల్లో కూడ కింది కోర్టు కోర్టుల శిక్షలనే సమర్దిస్తు తీర్పులు వెలువడ్డాయి. షబ్నమ్, సలీం ఇద్దరూ రాష్ట్ర గవర్నర్ కు ఆ తర్వాత రాష్ట్ర పతికి క్షమాభిక్ష కోరుతూ అర్జి పెట్టుకోగా తిరస్కరించారు. 

షబ్నమ్ కేసులో ఉన్న న్యాయపరమైన అవకాశాలన్ని అయి పోయాయి. ఇక డెత్ వారంట్ ఇష్యూ అయిన వెంటనే ఉరి తీయాల్సి ఉంటుంది..అందుకు ఆమెను మధుర జైళుకు తరలించాల్సి ఉంటదని జైళర్ రాకేష్ కుమార్ వర్మ తెలిపారు.  దేశంలో మహిళలను ఉరి తీసే ఒకే ఒక సౌకర్యం మధుర జైళులో మాత్రమే ఉంది. షబ్నమ్ తో పాటు సలీం ను కూడ వేరే జైళులో ఉరి తీయనున్నారు.

రాంపూర్ జైళు అధికారులు షబ్నమ్ డెత్ వారంట్ కోసం రెండు సార్లు కోర్టుకు విన్నవించారు. రిమైండర్ లెటర్ కూడ రాసారు. 

షబ్నమ్‌ను ఉరితీయనున్న పవన్ జల్లాద్ ఇప్పటికే రెండు సార్లు ఉరితీసే గదిని పరిశీలించారు. అవసరమైన మార్పులు జైళు అధికారులకు సూచించారు. పవన్ జల్లాద్ గతంలో నిర్భయ కేసు నిందితులను ఉరి తీసారు. షబ్నమ్ కేసులో ఇక క్షమాభిక్ష అవకాశాలు కూడ లేక పోవడంతో ఏం జరుగుతుందో నని  న్యాయ నిపుణులు మాత్రం ఆసక్తిగా చుస్తున్నారు. ఇలాంటి కేసుల్లో ఆఖరున మరణ శిక్షలను యావజ్జీవ శిక్షలుగా మార్చిన సందర్బాలున్నాయని ప్రముఖ న్యాయ వాది అర్షద్ అన్సారి పేర్కొన్నారు. 

షబ్నమ్ మేనమామ సత్తార్ అలి మాట్లాడుతూ షబ్నమ్ ను  ఉరి తీయాల్సిందే నని అన్నారు. కుటుంబ సబ్యులను అతి దారుణంగా చంపిన షబ్నమ్ కు ఉరే సరైన శిక్షఅన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు