వాణిదేవి టికెట్ పై విమర్శలు

ప్రశంసలకన్నా   విమర్శలే  ఎక్కువ


మాజి ప్రధాన మంత్రి పి.వి నరసింహారావు కూతురు వాణీ దేవికి హైదరాబాద్ ఎమ్మెల్సి టికెట్ ఇవ్వడంపై  ప్రశంసలకన్నా విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఓడి పోయేస్థానంలో టికెట్ ఇచ్చి నిలబెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు.  తన స్వార్ద రాజకీయాల కోసమే కెసిఆర్ పి.వి కుటుంబాన్నిరోడ్డుకు మీదికి తెచ్చారంటూ  బీజెపి నేత మాజి ప్రధాని పి.వి.నరసంహారావు మనవడు ఎన్వీ సుభాష్ మండిపడ్డారు. ఎమ్మెల్సి ఎన్నికల్లో బ్రాహ్మణుల ఓట్లు చీల్చేందుకే తన చిన్నమ్మ శ్రీవాణికి టికెట్ ఇచ్చారన్నారు. పి.వి.కుంటబంపై ప్రేమ ఉంటే ఆమెను నేరుగా రాజ్యసభకు నామినేట్ చేయవచ్చుకదా అని ప్రశ్నించారు. ఓడి పోయే సీటులో టికెట్ ఇచ్చి కుటిల రాజనీతిని చాటుకున్నారని విమర్శించారు.

కాంగ్రేస్ నేత పొన్నం ప్రబాకర్ మాట్లాడుతూ అభ్యర్థుల దొరకకనే శ్రీవాణి దేవికి టికెట్ ఇచ్చారన్నారు. ఓడి పోయేస్థానంలో టికెట్ ఇచ్చి పి.వి.కుటుంబాన్ని అవమాన పరిచారన్నారు. శ్రీవాణి దేవి తన నామినేషన్ ఉపసంహరించు కోవాలని విజ్ఞప్తి చేసారు.

ఇదిలా ఉండగా శ్రీవాణి నామినేషన్ పత్రాలు పూర్తిగా లేక పోవడంతో  సోమవారం నామినేషన్ వేయకుండానే వనెక్కి తిరిగి వచ్చారు. సుమారు నాలుగు గంటల పాటు ఆమె కార్యాలయం లో వేచు చూశారు. తిరిగి 23 వ తేదీన ఆమె నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు