భర్తను బ్యాంకులో దొరికిచ్చుకుని పబ్లిక్ గా చితగ్గొట్టిన భార్య

 మరో మహిళతో అక్రమసంభందం పెట్టుకున్నందుకు ఆగ్రహించిన భార్య 

వరంగల్ లో ఓ ప్రైవేట్ బ్యాంకులో జరిగిన సంఘటన


భార్య పిల్లలను వదిలేసి మరో యువతితో అక్రమ సంభందం పెట్టుకుని ఇంటికి రావడమే మానేసిన ఓ భర్తను అందరూ చూస్తుండగా బ్యాంకులో దొరికిచ్చుకుని చితక బాదింది ఓ వివాహిత మహిళ. ఈ సంఘటన మంగళవారం వరంగల్ నగరంలో పోచమ్మ మైదాన్ సర్కిల్ లో జరిగింది. 

ఏ ప్రైవేట్ బ్యాంకు లో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి 10 సంవత్సరాల క్రితం ఓ మహిళను ఇష్టపడి ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. వారికి ఓ పాప కూడ ఉంది. కొద్ది రోజులుగా శ్రీనివాస్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. మరో యువతితో అక్రమ సంభందం పెట్టుకుని భార్య పిల్లలను పట్టించు కోవడం మానేశాడు. అనేక సార్లు భర్తను నిలదీసింది. అయినా శ్రీనివాస్ లో మార్పు రాలేదు. కొద్ది రోజులుగా ఇంటికి రావడమే మాని వేసాడు. 

దాంతో ఓపిక నశించి పోయిన ఆ మహిళ తన భర్త శ్రీనివాస్ పనిచేస్తున్న బ్యాంకు కు వచ్చి భర్తను నిల దీసింది. ఇంటికి ఎందుకు రావడం లేదని బ్యాంకులో కస్టమర్లు సిబ్బంది అందరూ చూస్తుండగా నిలదీసింది. అంతటితో ఆగకుండా నాకు అన్యాయం చేస్తావా అంటూ  చొక్కా గళ్లా పట్టుకుని చితక బాదింది. ఈ సంఘటన చూస్తున్న వారంతా ఆమెను ఆపేందుకు ప్రయత్నించినా ఆమె ఊరు కోలేదు. ఈ గొడవంతా అక్కడున్న వారు సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. భర్తను చితక బాదడం పూర్తి అయిన తర్వాత నిన్ను వదిలి పెట్టేది లేదని హెచ్చరించి  నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు