అందుకే కెసిఆర్ అడవుల్లో పులులు వదిలిండట

 ఆదిలాబాద్ ఎంపి సోయం బాపు రావు విప్పిన గుట్టు ?


ఈ మద్య అటవి ప్రాంతాలతో కూడుకున్న జిల్లాలలో పులుల సమస్య ఆందోళన కలిగిస్తోంది. పులులు పశువులను చంపడంతో పాటు అంతటితో ఆగకుండా మనుషులపై కూడ దాడులు చేసి ప్రాణాలు తీస్తున్నాయి. హైదరాబాద్ వంటి మహానగరంలో కూడ పులులు దర్శనం ఇచ్చి వణుకు పుట్టించాయి.  ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇద్దరు పులుల భారిన పడి ప్రాణాలు కోల్పోయారు. పులుల సమస్య ఎందుకు ఏర్పడిందో ఆదిలాబాద్  బిజెపి ఎంపి సోయం బాపురావు ఓ గుట్టు వెల్లడించారు. ఆసలు ఈ పులలను వదిలింది ఎవరో కాదట సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆరే నట. ఎందుకంటారా...ఆ విషయం కూడ బాపురావే చెప్పారు.. ఆది వాసీల పోడు భూములకు ఎక్కడ పట్టాలివ్వాల్సి వస్తుందనే కెసిఆర్ అడవుల్లోకి పులులు వదిలాడని బాపురావు ఆరోపించారు.

 పెంచికల్ పేట్ మండలం కొండపల్లిలో పెద్దపులి దాడిలో మృతి చెందిన నిర్మల కుటుంబాన్ని సోమవారం  పరమార్శించిన సోయం బాపురావు ఆమె కుటుంబానికి  10 వేల సహాయం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని హామి ఇచ్చారు.

ఈ సందర్భంగా బాపు రావు మాట్లాడుతూ అడవుల్లోకి పులులు వదిలిన కెసిఆర్ కు ఆదివాసీల తరపున బంగారు పతకం ఇవ్వాలన్నారు. ఆదివాసి పోడు భూముల జోలికి ఎవరూ రావద్దని వస్తే దాడులు చేస్తామని హెచ్చరించారు. పులుల్ని పట్టుకుంటారా? లేక తమని చంపమంటారా?   అంటూ పోలీస్ స్టేషన్లలో దరఖాస్తులు పెట్టాలన్నారు.  ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని ఇక నుండి పోడు భూముల కోసం పులుల సమస్యపై తుడం దెబ్బ  ఉద్యమం చేస్తామని బాపు రావు అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు