ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణకు షర్మిల క్లాస్-రివర్స్ అయిన బాణం

 

ఆంధ్ర జ్యోతి పత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణకు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. ఎపి సిఎం జగన్ ఫ్యామిలీలో చిచ్చు రేపాలనే టార్గెట్ తో కొత్త పలుకులో వదిలిన బాణం రివర్స్ అయింది. 

తమ కుటుంబాన్ని టార్గెట్ చేసి దురుద్దేశంతో వార్త రాసారని షర్మిల మండి పడింది. తప్పుడు వార్త రాసిన పత్రికపై  న్యాయ పరమైన చర్యకు వెనుకాడ బోమని హెచ్చరించింది. 

తెలంగాణాలో  షర్మిల పార్టి పెట్టబోతున్నారంటూ ఆంధ్ర జ్యోతి పత్రిక ప్రచురించిన వార్తను ఖండిస్తూ షర్మిల సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. 

వేమూరి రాధాకృష్ణకు ఇలాంటి ఖండన ముండనలు మామూలే కావచ్చు కాని షర్మిల మాత్రం ఈ వార్తను నీతి మాలిన  వార్త కింద జమ కట్టింది.

 ఇంతకీ రాధాకృష్ణ కొత్త పలుకు విషయం ఏమిటంటే  అన్న జగన్ రాజన్న రాజ్యం దిశగా అడుగులు వేయ లేక పోతున్నాడని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని చెల్లి  షర్మిల స్వయంగా జగనన్న పై బాణం ఎక్కు పెట్ట బోతున్నారని  ఫిబ్రవరిలో  బహుశా 9 వ తేదీన స్వంతంగా పార్టి ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం ఉందని ఆంధ్రజ్యోతిలో ఆ పత్రిక  కర్మ కర్త క్రియ అయిన  వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు శీర్షికన ఆదివారం (24-01-2021)  జగన్ పైకి ఓ బాణం  వదిలాడు. వై.ఎస్.కుటుంబంలో జగన్ కు తల్లికి, చెల్లికి మధ్య దూరం పెరిగిందనేది రాధాకృష్ణ సారాంశం. తెలంగాణ లో షర్మిల చేత  పార్టి పెట్టిస్తానని గతంలో హామి ఇచ్చిన జగన్ ఎపిలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ లో తన ఆస్తులు ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకునేందుకు కెసిఆర్ తో దోస్తి కట్టి ఇచ్చిన హామీ మరిచారని షర్మిల అగ్రహంతో ఉన్నారని అందులో పేర్కోన్నారు. తన చెల్లెలు తెలంగాణ లో పార్టి ఏర్పాటు చేస్తే తెలంగాణ సిఎం కెసిఆర్ తో సంభందాలు దెబ్బతింటాయని అంతే కాక రాజకీయాల్లోకి షర్మిల ప్రవేశిస్తే తెలంగాణాకే పరిమితం కాకుండా ఎపికి కూడ పాకి పోతారనే భయం జగన్ కు ఉందంటూ రాసారు. అన్నా చెల్లెల్ల మద్య జరుగుతున్న వార్ లో తల్లి విజయమ్మ చెల్లెలి వైపే మొగ్గు చూపనున్నారని కూడ విఫులీకరించారు. మొత్తంగా జగన్ ఫ్యామిలీలో అన్నకు చెల్లికి పొసగటం లేదని అందుకే పార్టి పెట్ట బోతున్నారని నమ్మ బలుకుతూ కొత్త పలుకులో చేసిన విశ్లేషణ షర్మిల ఖండనతో తెల్ల బోయింది. 

 వేమూరి రాధాకృష్ణ ఎపిలో జగన్ అధికారం లోకి వచ్చినప్పటి  నుండి ఏదో ఒక మసాలా  వార్తతో  జగన్ ను ఆయన సర్కార్ ను  ఆడి పోసుకుంటూ మరో వైపు  చంద్రబాబు ను ఆయన కమ్మని లాలనను  వేమూరి రాధాకృష్ణ మరిచి పోలేక పోతున్నాడనే విమర్శలు ఉన్నాయి.  కమ్మనైన వార్తలు వండి వడ్డిస్తూ సంబర పడి పోతూ సంబర పెడుతూ ఉండే రాధాకృష్ణకు షర్మిల విషయంలో  వార్త అడ్డం తిరిగింది.  ఆంధ్ర జ్యోతిలో వార్త కథనం నిజమే అయితే షర్మిల ధైర్యంగా నిలబడి ఎస్ అనే వారే. కాని స్వయంగా షర్మిల స్పందిస్తూ తప్పుడు వార్త కథనం  ఖండిస్తున్నా నంటూ పత్రికా ప్రకటన విడుదల చేయడంతో  రాధాకృష్ణ గాలి తీసినట్లు అయింది.  రాధాకృష్ణ పలికి నట్లు షర్మిల నిజంగా పార్టీ ఏర్పాటు చేసేందుకు సిద్దపడితే  ఆమె ఖండించే వారు కాదు కదా. ఎందుకంటే వై.ఎస్ కుటుంబంలో షర్మిల ఓ నిర్ణయానికి వస్తే ఆమె మనసు మార్చడం ఎవరితోను కాదనేది వై.ఎస్ కుటుంబ సన్ని హితుడు ఒకరు చెప్పినట్లు రాధాకృష్ణ తన పలుకులోనే ఉటంకించారు.  రాధాకృష్ణ రాసినట్లు షర్మిల  తన నిర్ణయానికి కట్టు బడాలి కాని ఖండన హేమిటి    కిష్టయ్య అంటూ పాఠక లోకం ప్రశ్నార్దకంలో పడి పోయింది.   

షర్మిల విడుదల చేసిన పత్రిక ప్రకటన ఇలా ఉంది.

సోమవారం పత్రికా  ప్రకటన విడుదల చేశారు. "ఆదివారం నాడు ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్‌ ఐటమ్‌గా వచ్చిన వార్త నా దృష్టికి ఆలస్యంగా వచ్చింది. వైఎస్సార్‌ గారి కుటుంబాన్ని టార్గెట్‌ చేసి దురుద్దేశంతో రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాను.  ఏ పత్రిక అయినా, ఏ చానల్‌ అయినా ఓ కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయటమే తప్పు. అది నీతి మాలిన చర్య. అటువంటి తప్పుడు రాతలు రాసిన పత్రిక, చానల్‌ మీద న్యాయ పరమైన చర్యలకు వెను కాడబోమని తెలియజేస్తున్నా" అని వైఎస్‌ షర్మిల ప్రకటనలో పేర్కొన్నారు.

మొదట వచ్చిన వార్త స్థాయిలో  షర్మిల ఖండన వార్త ప్రచురిస్తారా లేక  లేక  షర్మిల పార్టీ పెట్టబోవటం లేదట అంటూ లోపలి పేజీలలో ఎక్కడో ఓ మూలన చిన్న వార్త పడేస్తారా చూడాలి. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు