చికెన్ అంటే భయ పడుతున్న జనం - తినచ్చు అంటున్న మంత్రులు

 బర్డ్ ఫ్లూ భయంతో చికెన్, గుడ్లు తినాలంటే భయపడుతున్న జనం
భయం లేదన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ ధరలు అమాంతం పడి పోయాయి. తెలుగు రాష్ట్రాలలో ధరలు కొంచెం తగ్గినా ఉత్తరాధిన ధరలు ఆమాంతం పడి పోయాయి. గుజరాత్, మహారాష్ట్ర లో కిలో ధర రూ 80 లోపే ఉంది. ఢిల్లీలో  బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు కనిపించడంతో చికెన్ తినాలంటే భయ పడి పోతున్నారు. తమిళ నాడు రాష్ర్టంలో కూడ చికెన్ ధరలు పడి పోయాయి. తెలంగాణ లో ముందు ముందు చికెన్ ధరలు పడి పోయే ప్రమాదం కనిపిస్తోంది. తెలంగాణ లో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఇప్పటి వరకు బైట పడక పోయినా చికెన్ అమ్మకాలు తగ్గు ముఖం పట్టాయి. దాంతో పౌల్డ్రి రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే తెలంగాణ లో మాత్రం అంతగా భయపడాల్సిన అవసరం లేదని స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటన చేసారు. 

పుశసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పౌల్డ్రి రంగ నిపుణులతో మంగళవారం సమావేశం జరిపి పరిస్థితులు సమీక్షించారు.

ఈ సందర్బంగా  మంత్రి ఈటెల ప్రకటన చేస్తూ ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూకారణంగా మనుషుల ప్రాణాలకు హాని జరగలేదని అన్నారు. చికెన్, కోడిగుడ్లు తింటే బర్డ్ ప్లూ రాదని ఈ విషయాన్ని వైద్య నిపుణులు కూడ ధృవీకరించారని అన్నారు. బర్డ్ ప్లూ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. బర్డ్ ఫ్లూ విషయంలో ఎలాంటి పుకార్లు నమ్మవద్దని అన్నారు.

కరోనా సంక్షోభం నుంచి పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని... ఇలాంటి సమయంలో మళ్లీ బర్డ్ ఫ్లూపై భయాందోళనలు అవసరం లేదని ప్రజలకు సూచించారు. పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. పౌల్ట్రీ రైతులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. వారికి ప్రభుత్వం సలహాలు సూచనలు ఇస్తోందని మంత్రి తలసాని చెప్పారు. వలస పక్షుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని  మంత్రి తలసాని శ్రీనివాస రావు తెలిపారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు