నాతో పెట్టుకోవద్దు - ఎస్పీకి వార్నింగ్ ఇచ్చిన వై.సి.పి ఎమ్మెల్యేఏమనుకుంటున్నావు నువ్వు... ఇవాళ ఉంటావు, రేపు మరో జిల్లాకు పోతావు... నాతో పెట్టుకోవద్దు... ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా ఉండు! అంటూ హెచ్చరించారు.  టీడీపీ నేతల మాట వింటూ ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టవద్దని చెప్పడానికి నువ్వెవరు?  నువ్వు టీడీపీ ఏజెంటువా లేక జిల్లా అధికారివా? అంటూ నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ను ఉద్దేశించి ఆయన పేరును ప్రస్తావించకుండానే వార్నింగ్ ఇచ్చాడు.

డీసీఎంఎస్ చైర్మన్ చలపతిరావుపై పోస్టులు పెడితే, వారిపై చర్యలు తీసుకోవద్దని నీ కింది అధికారులకు ఫోన్ చేస్తావా? అంటూ ఎస్పీపై మండి పడ్డాడు. డీసీఎంఎస్ చైర్మన్ చలపతిరావుపై పోస్టులు పెడితే, వారిపై చర్యలు తీసుకోవద్దని నీ కింది అధికారులకు ఫోన్ చేస్తావా? ఏమనుకుంటున్నావు నువ్వు అని విరుచుకు పడ్డాడు. 

నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నల్లపురెడ్డి ఎస్పీ భాస్కర్ భూషణ్ పై ఈ ఘాటు విమర్శలు చేశారు. ఓ వివాదం విషయంలో ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేయనందుకు పరుష పదజాలంతో దూషించారు. టీడీపీ వాళ్లు చెప్తే కేసు రిజిస్టర్ చేయకుండా ఉండటానికి నువ్వెవరంటూ తిట్లదండకం ఎత్తుకున్న నల్లపురెడ్డి అధికార పార్టీ వాళ్లు చెప్తే కేసు నమోదు చేయగా..? అని ప్రశ్నించారు.

వాడికి ఒళ్లు బలిసి మా నేతపై పోస్టులు పెట్టాడు. మరి చర్యలు తీసుకోవాలా, లేదా? ఎవరో టీడీపీ మాజీ మంత్రి ఫోన్ చేస్తే  కేసులు రిజిస్టర్ చేయవద్దని నువ్వేందయ్యా చెప్పేది? ఎన్ని రోజులు ఉంటావు నెల్లూరు జిల్లాలో? రెండు రోజులు లేక మూడ్రోజులు ఉంటావు. తర్వాత నీ బ్రతుకేంది?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఓ జిల్లా ఎస్పీని ఉద్దేశించి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇట్లా మాట్లాటం పట్ల విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యే స్తాయిని మరిచి మాట్లాడరని ప్రతిప్కష నేతలు విమర్శించారు. అధికారులను తమ అదుపు ఆజ్ఞల్లో  పెట్టుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.

ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలకు సంభందించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈయన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ఎట్లా స్పందిస్తారో చూడాలి. మరో వైపు అధికారులు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై  తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు