పార్టి అధిష్టానంపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు - పార్టి విధానాలు తప్పు పట్టిన రాజగోపాల్ రెడ్డి

 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రేస్ కమిటి అద్యక్ష పదవి విషయంలో కోమటి రెడ్డి బ్రదర్స్ అసంతృప్తిలో ఉన్నారు. వెంకట్ రెడ్డి బాహాటంగా బయట పడక పోయినా ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి మాత్రం పార్టి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భవిష్యత్ లో  తాను బిజెపీలో చేరతానన్న రాజగోపాల్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. సందర్భం చిక్కినపుడల్లా పార్టీపై విరుచుకు పడుతున్నారు.


కాంగ్రేస్ పార్టి నేత ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి  పార్టి అధిష్టానాన్నితప్పు పడుతూ మరో మారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర పార్టి వ్యవహారాల ఇన్ చార్జి పై కూడ విమర్శలు గుప్పించారు.

కాంగ్రేస్ పార్టి  అధ్యక్ష పదవికి రాజ గోపాల్ రెడ్డి సోదరుడు వెంకట్ రెడ్డి పోటి పడ్డారు. రేవంత్ రెడ్డి తో పాటు ఇతరులు కూడ పదవి ఆశించారు. అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఉన్నందును పిసిసి పదవి ప్రకటిస్తే పార్టీలో అసంతృప్తులు చోటు చేసుకుంటాయని సీనియర్ నేత జానారెడ్డి చేసిన సూచనతో అధిష్టానం టీపిసిసి చీఫ్ ఎంపికను వాయిదా వేసింది. 

ఇదే విషయంపై రాజగోపాల్ రెడ్డి సోమవారం హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో మీడియా ఎదుట స్పందించారు.  పార్టి ఇన్ చార్జి గా ఉన్న మణిక్యం ఠాగూర్ ను ఉద్దేశించి పేరు ఎత్తుకుండానే పరోక్షంగా విమర్శలు చేశారు.డిపాజిట్లు కూడ రాని వ్యక్తులను తెలంగాణకు పంపిస్తే కాంగ్రేస్ ఎట్లా బలపడు తుందని ప్రశ్నించారు.  ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి రాష్ట్ర రాజకీయాలు ఎట్లా అర్దం అవుతాయని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు టిపిసిసి చీఫ్ పదవికి ముడి పెట్టడం ఏమిటని అన్నారు. తనకు కాంగ్రేస్ పార్టి అంటే చాలా అభిమానమని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి పార్టి అధిష్టానం చేసిన పొరపాట్ల వల్లే రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టి బాగా బలహీన పడిందని అన్నారు. రాష్ట్ర వ్యవహారాల విషయంలో అధిష్టానం స్వంతంగా నిర్ణయాలు తీసుకునే రీతిలో లేదనే విషయం అర్దం అవుతోందని అన్నారు. కాంగ్రేస్ పార్టి కోసం తాము (కోమటి రెడ్డి సోదరులు) చేసిన కృషిని గుర్తించడం లేదని అన్నారు. పార్టీ కోసం కష్ట పడే వారిని గుర్తించినపుడే పార్టీకి మనుడ ఉంటుందని అన్నారు.

రాజగోపాల్ రెడ్డి ఇటీవల తిరుపతి పర్యటనలో  తాను భవిష్యత్ లో బిజెపి లో చేరవచ్చిన చేసిన వ్యాఖ్యలు కాంగ్రేస్ పార్టీలో కలకలం రేపాయి. రాజగోపాల్ రెడ్డిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని కొందరు పార్టి నేతలు డిమాండ్ చేసారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు