ప్రగతి భవన్ ముట్టడించిన బిజెపి కార్పోరేటర్లు

 


ఎన్నికలు జరిగి నెల రోజులు కావస్తున్నా ఇంత వరకు జిహెచ్ఎంసి పాలకవర్గం ఏర్పాటు చేయనందుకు నిరసనగా మంగళవారం  భారతీయ జనతా పార్టి కార్పోరేటర్లు ప్రగతి భవన్ ను ముట్టడించారు. అకస్మాత్తుగా కార్పోరేటర్లు కెసిఆర్,కెటిఆర్ డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పోలీసుల వలయాన్ని ఛేదించుకుని  ప్రగతి భవన్  వైపు దూసుకు వెళుతుండగా పోలీసులు వారిని బలవంతాన అడ్డుకున్నారు. దాంతో కార్పోరేటర్లు ప్రగతి భవన్ వెలుపల రోడ్డుపైనే బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్పోరేటర్లకు పోలీసులకు మద్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. కార్పోరేటర్లను అక్కడి నుండి పోలీసులు వాహనాల్లో తరలించారు.

తామేమి నేరస్తులం కాదని పాలకవర్గం ఏర్పాటు చేయనందుకు ప్రభుత్వ  విధానంపై నిరసన తెలిపేందుకు వస్తే అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అధికార పార్టీకి అనుకూలమైన ఫలితాలు రాలేదనే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. పాలక వర్గం ఏర్పాటు కాక పోవడం వల్ల ప్రజల సమస్యలు ఎక్కడి వక్కడే పేరుకు పోయాయని నగరంలో వరద కారణంగా ఏర్పడిన సమస్యలు ఇంత వరకు పరిష్కారానికి నోచు కోలేదని విమర్శించారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు