బిజెపి నాయకులపై దౌర్జన్యం చేసిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలన్న బిజెపి చీఫ్ బండి సంజయ్


సిఎం,డిజీపీలకు 24 గంటల గడువు
పోలీసులను సస్పెండ్ చేయని పక్షంలో డిజిపి కార్యాలయం 
ముట్టడిస్తామని హెచ్చరిక
కెటిఆర్ ఈపు పగల గొట్టినా కెసిఆర్ మౌనంగానే ఉంటాడా ? అని ప్రశ్నించిన బండి సంజయ్
బిజెపి నాయకులను గొడ్లను బాదినట్లు బాదారని ఆవేదన 
బిజెపి కార్యకర్తల రక్తం కండ్లారా చూస్తూ పోలీసు లు రాక్షసానందం పొందుతున్నారు


జనగామ జిల్లా కేంద్రంలో పోలీసులు బిజెపి  నాయకులు, కార్యకర్తలపై జరిపిన దౌర్జన్యం పై ఆ పార్టి చీఫ్ బండి సంజయ్ మండి పడ్డారు. 24 గంటల్లో సంభందిత పోలీసు అధికారులను సస్పెండ్ చేయని పక్షంలో రాష్ట్ర డిజిపి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పోలీసుల చర్యను నిరసిస్తూ  బుధవారం చలో జనగామ కార్యక్రమానికి పిలుపు నిచ్చారు. తానుకూడ స్వయంగా జనగామకు వెళతానని  బండి సంజయ్ తెలిపారు.

మంగళవారం జనగామ మున్సిపల్ కార్యాలయంలో నిరసన తెలుపుతున్న బిజెపి యువ మోర్చా పట్టణ అధ్యక్షులు పవన్ శర్మ, యువల మోర్చా కార్యకర్తలు క్రాంతి కుమార్, వినోద్ కుమార్, క్రాంతి తదితరులను పోలీసులు చితక బాదారు. స్వామి  వివేకామంద జయంతి దినోత్సవం సందర్భంగా నగరంలో బానర్లు కట్టగా వాటిని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అందుకు నిరసనగా బిజెపి నాకులు కార్యకర్తలు జనగామ మున్సిపల్కమీషనర్ ఛాంబర్ ఎదుట నిరసన చేపట్టారు. దాంతో పోలీసూలు రంగ ప్రవేశం చేసి వారిపై విరుచుకుపడ్డారు. బిజెపిి నాయకులను బూతులు తిడుతూ సిఐ మల్లేశ్ లాఠీతో విచక్షణా రహితంగా కొట్టిన  వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనతో బిజెపి పార్టి నాకులు పోలీసులపై  తీవ్ర ఆగ్రహా వేశాలు వెలల్లగక్కారు.

భీం దేవరపల్లి పర్యటనలో ఉన్న బండి సంజయ్  పోలీసులు తీరుపై రాష్ట్ర డిజిపికి, ముఖ్యమంత్రికి  వార్నింగ్ ఇచ్చారు.  రాష్ట్రంలో పోలీసులువ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. ముఖ్యమంత్రి ఈ సంఘటనపై స్పిందించాలన్నారు. తన కొడుకు కెటిఆర్ వీపు పగల గొట్టినా కెసిఆర్ మౌనంగా ఉంటారా అని ప్రశ్నించారు. పోలీసులు బిజెపి నాయకులను కార్యకర్తలను గొడ్లను బాదినట్లు బాదారని విమర్శించారు.  పోలీసులు రాష్ట్రంలో బిజెపి కార్యకర్తల రక్తం కండ్ల చూస్తు  రాక్షసా నందం పొందుతున్నారని బండి సంజయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి మానవత్వం ఉంటే డిజిపికి ఆదేశాలిచ్చి  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.  ఫ్రెండ్లి పోలీసు  అంటూ పోలీసులు రాష్ర్టంలో అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.  సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన బిజెపి కార్యకర్తలపై అక్రమ కేసులు  పెడుతున్నారని ఆరోపించారు. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు