టిఆర్ఎస్ అడ్రస్ గల్లంతు చేస్తాం-బిజెపి చీఫ్ బండి సంజయ్

 వరంగల్ త్రయి నగర పుర వీధుల్లో బండి సంజయ్ కు అపూర్వ స్వాగతం


రాష్ట్రంలో టిఆర్ఎస్ అడ్రస్ గల్లంతు చేస్తామని భారతీయ జనతా పార్టి చీఫ్ బండి సంజయ్ హెచ్చరించారు. సిఎం కెసిఆర్ కు వణుకు పుట్టిందని ఆయన పొర్లు దండాలు పెట్టినా వదిలి పెట్టేది లేదని అన్నారు.

మంగళవారం వరంగల్ పర్యటనకు వచ్చిన బండి సంజయ్ సమక్షంలో పలువురు టిఆర్ఎస్ ముఖ్యనేతలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన పార్టి సమావేశంలో బండి సంజయ్ టిఆర్ఎస్ పైనా కెసిఆర్ పైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

 భవిషత్ లో బిజెపితో పొత్తు పెట్టుకుంటామన్న తప్పుడు సంకేతాలు ఇచ్చేందుకు దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఫరాభవం తర్వాత కెసిఆర్  ఢిల్లీకి వెళ్లాడని  బండి సంజయ్ అన్నారు. కెసిఆర్ ఆయన కుటుంబం అవినీతితో  రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని పార్టీలో ఉండాలా వద్దా అని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆలోచనలో పడితే కెసిఆర్ వారికి నమ్మకం కలిగించేందుకు ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా కాపాడు కునేందుకు ఢిల్లీ వెళ్లి తప్పుడు సంకేతాలు ఇచ్చాడని అన్నారు. బట్టే  బాజ్ వేశాలు వేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కెసిఆర్ ను వదిలి పెట్టే ప్రసక్తే లేదని అన్నారు. గడువు ముగియక ముందే జిహెచ్ఎంసి ఎన్నికలకు తొందరపడిన కెసిఆర్ వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. దమ్ముు, ధైర్యం ఉంటే వరంగల్ లో ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేసారు. వరంగల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ను బ్రేక్ డాన్స్ చేయించేందుకు బిజెపి కార్యకర్తలు సిద్దంగా ఉండాలన్నారు. 

వరంగల్ లో వరదలు వస్తే కెసిఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ లో వరదలు వచ్చి ప్రగతి భవన్ చుట్టు ముట్టినా కెసిఆర్ బయటకు రాలేదని అన్నారు. కేంద్రం స్మార్ట్  సిటి నిధులు ఇస్తే దారి మళ్ళించారని ఆరోపించారు. స్మార్ట్ సిటీ పథకానికి రాష్ట్రం వాటా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని విమర్మించారు. కేంద్రం నిధుల విషయంలో తాము చెప్పే  విషయాలన్ని అబద్దం అయితే 40 గంటల సమయం ఇస్తున్నామని టిఆర్ఎస్  మంత్రులు, ఎమ్మెల్యేలు  భద్రకాళి ఆలయానికి వచ్చి ప్రమాణం చేసి చెప్పాలని బండి సంజయ్ సవాల్  చేసారు. 

ఎంఐఎం అడ్డగా వరంగల్

కెసిఆర్ వరంగల్ నగరాన్ని ఎంఐఎం అడ్డాగా మారుస్తున్నారని బండి సంజయ్ మండి పడ్డారు. వరంగల్ కామ్ గా లేదని  కామ్ గా  ఉంటే సాయిబాబా ఆలయ పూజారి చనిపోయే వాడే కాదని అన్నారు. మైనార్టి ఓట్ల కోసం 80 శాతం ఉన్న హిందువులను కెసిఆర్ బలి చేస్తున్నారని దుయ్యబట్టారు. తాము మెజార్టి హిందువుల  ప్రయోజనాలు కాపాడేందు కోసమే కాంగ్రేస్, టిఆర్ఎస్ పార్టీలు లౌకిక వాదం పేరిట ఆడే దొంగ నాటకాలకు  అడ్డు కట్టలు వేస్తుంటే బిజెపీని మత తత్వ పార్టీగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. వరంగల్ అభివృద్ధిని కెసిఆర్ నిర్వీర్యం చేసారని విమర్శించారు.

కెసిఆర్ వేస్ట్ ఫేలో ఆఫ్ ఇండియా 

గూగుల్ లో వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని  వెదికితే తెలంగాణ సిఎం కెసిఆర్ పేరు వస్తున్న దంటూ బండి సంజయ్ పార్టి కార్యకర్త నొకరిని పిలిచి మొబైల్ ఫోన్లో సర్చ్ చేయించారు. అట్లాగే బెస్ట్ మాన్ ఆఫ్ ఇండియా అని గూగుల్ లో వెదికితే  ప్రధాన మంత్రి నరేంద్ర మోది పేరు వస్తుందని చూపించారు.

సవాళ్లు, విసుర్లు, ఛాలెంజ్ లు, పిట్ట కథలతో ఆకట్టుకున్న సంజయ్

బండి సంజయ్ వరంగల్ పర్యటనలో పార్టి కార్యకర్తలు అపూర్వ  రీతిలో స్వాగతం పలికారు. కాజిపేట, హన్మకొండ, వరంగల్ త్రయినగర పుర వీధులన్ని కాశాయంతో రెప రెపలాడాయి. మంగళహారతులు పట్టి, తిలకం దిద్దుతూ  బండి సంజయ్ పై పూల వర్షం కురిపించారు. మద్యాహ్నం లంచ్ బ్రేక్ కూడ లేకుండా  ఆయన పర్యటన సాగింది. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు