ఉర్రూత లూగించిన వార్శి బ్రదర్స్ కవ్వాలి

 సి. ఎస్. సోమేశ్ కుమార్ తోపాటు 
హాజరైన ఉన్నతాధికారులు



భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చారిత్రిక మొజామ్ జాహి మార్కెట్ ఆవరణలో ఆదివారం రాత్రి నిర్వచించిన వార్సీ బ్రదర్స్ కవ్వాలి ప్రదర్శన ఆహుతులను ఉర్రూత లూగించింది. షామ్-ఏ-సూఫీయానా అనే పేరుతొ జీహెచ్ఎంసీ, మున్సిపల్ పరిపాలనా శాఖ నిర్వహించిన వార్శి బ్రదర్స్ కవ్వాలీ ప్రదర్శనకు నగరంలోని కవ్వాలీ ప్రేమికులు పెద్ద హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయిష్ రంజన్, ముఖ్య కార్యదర్శులు వికాస్ రాజ్, సందీప్ సుల్తానియా, జీహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, ఎక్సయిజ్ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్, లు హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ మాట్లాడుతూ, నగర ఘనమైన చారిత్రక వారసత్వన్ని తెలియ చేసేక్కా నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో ఈ విధమైన సాంస్కృతిక కార్యక్రమాలను రెగ్యులర్ గా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.


*ఉర్రూత లూగించిన వార్సీ బ్రదర్స్ కవ్వాలీ*
ప్రభుత్వం ఇటీవల రూ. 15 కోట్ల వ్యయంతో పునరుద్ధరించిన మొజాంజాహి మార్కెట్ ఆవరణలో నిర్వహించిన కవ్వాలీ ప్రదర్శన ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. నజీర్ అహ్మద్ వార్శి, నసీర్ అహ్మద్ వార్శి నెత్రుత్వంలోని 14 మంది కళాకారులు... అల్లాహూ అనే సూఫీ గానంతో కావ్వాలితో ప్రారంబించి అమీర్ ఖుష్రూ గీతాలను, వివిధ సినిమాల్లో ఉన్న ప్రముఖ కావ్వాలి పాటలను తమదై న ప్రత్యేక శైలిలో ఆలపించారు.

ప్రధాన గాయకులు నజీర్, నసీర్ వార్శి ల ఖవ్వాల్ గానానికి తోడు హార్మోనియంలు, తబలా, ఢోలక్, క్లారియోనెట్, సారంగి, బుల్‌బుల్ తార వాయిద్యకారుల సంగీతం విశేషంగా ఆకట్టు కున్నాయి.
*రూ.15 కోట్లతో మొజం జాహి మార్కెట్ పునరుద్దరణ*
న‌గ‌రంలో ఉన్న అనేక చారిత్ర‌క నిర్మాణాల పునరుజ్జీవింప చేయుట‌కు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రూ.15 కోట్ల వ్య‌యంతో మోజంజాహి మార్కెట్ కు పూర్వ‌వైభ‌వం క‌ల్పించింది.
. 1935లో నిజాం నిర్మించిన ఈ చారిత్ర‌క క‌ట్ట‌దానికి పూర్వ వైభ‌వాన్ని పున‌రుజ్జీవంప‌జేసేందుకు పుర‌పాల‌క శాఖ నిధులు మంజూరు చేసింది.. ఈ మార్కెట్‌ పునరుద్ధరణను పనులపై ‌ పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి అర్వింద్ కుమార్ ఈ సందర్బంగా వివరించారు. ఇటీవల మరణించిన మాజీ ఐ.ఏ.ఎస్ అధికారి నరేంద్ర లూథర్ సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ కవ్వాలి కార్యక్రమానికి నగరంలోని కవ్వాలి ప్రేమికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు