షర్మిల పార్టి తెలంగాణ లో లాభం లేదు ఆంధ్రలో పెట్టాలి...కాంగ్రేస్ సీనియర్ నేత వి.హన్మంతరావు

 


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో మరో రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారనే వార్తల నేపద్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ వి. హనుమంతురావు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై మాట్లాడుతూ..తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల ఉపయోగం ఉండదని వీహెచ్ జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయని, ఏపీలో అయితే జగన్ వ్యతిరేకులు షర్మిల వెంట వస్తారని చెప్పారు.

షర్మిలకు విశాఖ టికెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశాడని ఆరోపించారు. షర్మిలలో ప్రవహిస్తున్నది కూడా వైఎస్ రక్తమేనని, అందుకే షర్మిల పార్టీ ఆలోచన చేస్తున్నట్లు ఉన్నారని వీహెచ్ వ్యాఖ్యానించారు.
జగన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే షర్మిల ఆంధ్రప్రదేశ్ లోనే పార్టీ పెట్టుకోవాలని వీహెచ్ సూచించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా తాను తప్ప ఎవరూ ఉండకూడదని జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నాడన్నారు వీహెచ్. షర్మిల ఒకవేళ పార్టీ పెట్టదలిస్తే ఏపీలోనే కొత్త పార్టీ పెట్టడం మేలన్నారు. ఇప్పటికే టీడీపీ నేత పట్టాభి కూడా షర్మిల పార్టీపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తమనకు సమాచారం ఉందన్నారు.

అయితే గత కొంతకాలంగా షర్మిలా పార్టీ పెడుతున్నారని, కాంగ్రెస్, బీజేపీ మళ్లిన మెజార్టీ వర్గాన్ని దూరం చేయడానికే పార్టీ పెడుతున్నారని ఓ వర్గం మీడియాలో వీపరీంతంగా ప్రచారం చేస్తుంది. అయితే దీనిని ఖండిస్తూ షర్మిలాగానీ వైసీపీ నుంచిగాని ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు