కెటిఆర్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన బండి సంజయ్ -మరో మూడేళ్ళు కెసిఆరే ముఖ్యమంత్రి

 నగర వీధుల్లో భారీగా కమలం  ర్యాలి 


కెటిఆర్ ఆకు ఆయన అభిమానులకు భారతీయ జనతా పార్టి చీఫ్ బండి సంజయ్  బ్యాడ్ న్యూస్ చెప్పారు.  తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం మార్పులు జరగ బోతున్నాయంటూ కెసిఆర్ తన కుర్చీలో తనయుడు కెటిఆర్ ను కూర్చో బెడతారని  గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఊహాగానాలపై స్పందించిన బండి సంజయ్ అలా జరగబోదంటూ ఆశ్చర్యకర విశ్లేషణ చేసారు. కెటిఆర్ ను ముఖ్యమంత్రి చేసే ఉద్దేశం కెసిఆర్ కు లేదని  మరో మూడేళ్ళు కెసిఆరే ముఖ్య మంత్రిగా కొనసాగనున్నారని అన్నారు.

మంగళవారం వరంగల్ పర్యటన కొచ్చిన బండి సంజయ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికలలో టిఆర్ఎస్ వరుస పరాజయాలతో ఎదురు దెబ్బలతో ఉన్న సమయంలో టిఆర్ఎస్ పార్టి సీనియర్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ మారిచిలో కెటిఆర్ ముఖ్యమంత్రి కానున్నారనే  వార్తను వెల్లడించారు. సీనియర్ ఎమ్మెల్యే నోటి నుండి ఆ మాట రావడంతో ఇక కెటిఆర్ ముఖ్యమంత్రి కావడమే తరువాయంటూ హరీశ్ రావు కు పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ భాద్యతలు అప్పగిస్తారని మంత్రి ఈటెలకు ఉప ముఖ్యమంత్రి ఇస్తారని ఇట్లా రక రకాల వార్తలు విశ్లేషణలకు మీడియా వేదికగా మారింది. కెటిఆర్ ముఖ్యమంత్రి అవుతారన్న విశ్వాసంతో పార్టి కార్యకర్తలు, నాయకులు కూడ ఎదురు చూస్తున్నారు.

ఈ తరుణంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు టిఆర్ఎస్ శ్రేణుల ఆశలపై నీళ్ళు చల్లినట్లే అయ్యాయి.  ఓ జాతీయ పార్టి రాష్ట్ర నాయకుడు అందులో ఈ మద్య కాలంలో ఇమేజ్ రెట్టింపై కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోది, హేం మంత్రి అమిత్ షా తదితర ముఖ్యుల కనుసన్నల్లో వారికి అత్యంత సన్నిహితంగా మెదులుతున్న  బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేసారంటే ఆయనకు ఖచ్చిత మైన సమాచారం ఉండే ఉంటుందని అర్దం చేసు కోవాలి.


వరంగల్ పర్యటనలో కూడ బండి సంజయ్ కెసిఆర్ పై విమర్శలు  కొనసాగించారు. గత ఆరేళ్ళుగా కెసిఆర్ ఆయన కుటుంబ సబ్యులు అంతు లేని అవినీతి  అక్రమాలకు పాల్పడ్డారని త్వరలో బట్ట బయలు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు తమ పార్టీ వైపే నిలిచారని అన్నారు. 2023 లో ఎపి లోను తెలంగాణా లోను బిజెపి అధికారం లోకి రాబోతోందని అన్నారు.


పార్టీలో చేరిన టిఆర్ఎస్ ముఖ్య నేతలు కోర బోయిన సాంబయ్య, గైనేని రాజన్, కుమారస్వామి

టిఆర్ఎస్ ముఖ్యనేత కోర బోయిన సాంబయ్య, గైనేని రాజన్ కాంగ్రేస్ పార్టి నాయకుడు గంట రవి కుమార్ లు భాజపాలో చేరారు. వారికి బండి సంజయ్  పార్టి కండువాలు కప్పి పార్టీ లోకి అహ్వానించారు. 

ఘన స్వాగతం పలికిన పార్టి శ్రేణులు

బండి సంజయ్ కు పార్టి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నగరం పొలుమేర మడి కొండ నుండి టూ వీలర్ ర్యాలీతో స్వాగతం పలికారు. అమర వీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం నగర వీధుల గుండా హన్మకొండ, వరంగల్, హంటర్ రోడ్ లో ర్యాలి కొన సాగింది.  బండి సంజయ్ ర్యాలీని ముస్లం మైనార్టీలు ఎక్కువగా ఉండే మండి బజార్ గుండా అనుమతి ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు. బండి సంజయ్ కాన్వాయ్ ను పోచమ్మ మైదానం సర్కిల్  లో నిలిపి వేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

మండి బజార్ సర్కిల్ సమీపంలో సాయిబాబా  ఆలయాన్ని బండి సంజయ్ సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ ఆలయ పూజారిపై  గతంలో ముస్లీం వ్యక్తి దాడి చేసి కొట్టడంతో  పూజారి చికిత్సపొందుతూ  మరణించాడు. ఆలయంలో పాజారి చిత్ర పఠానికి బండి సంజయ్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. గతంలో పూజారి మరణించిన పుడు కూడ బండి సంజయ్ ఆయన అంత్యక్రియలకు హాజరై పాడె మోసారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు