ఎపిలో రాజకీయ ధ్వంస రచన - నిఘావర్గాల విఫలం

 




ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ ధ్వంస రచన కొనసాగుతోంది.గుర్తు తెలియని మతోన్మాద శక్తులపై అనుమానాలు కలిగే రీతిలో హిందూ ఆలయాల విగ్రహాల ధ్వంస రచన వరుసగా కొనసాగుతోంది. ఏదో ఒకటి రెండు ఆలయాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయంటే మామూలుగా భావించివచ్చు కాని వరుసగా పనిగట్టుకుని జరుగుతున్న రీతిలో కేవలం హిందూ ఆలయాల విగ్రహాలనే టార్గెట్ చేసి ధ్వంసం చేడయం ఆందోళన కలిగిస్తోంది. 

ఇంత జరుగుతున్నా నిఘా వర్గాలు పోలీసులు ఏం చేస్తున్నారో అర్దం కాదు. అందరి చూపుడు వేళ్ళు  పోలీసుల వైపు ఎక్కు పెట్టారు. రాష్ట్రంలో రాజకీ. అస్థిరత్వానికి ఒడి గడుతున్న శక్తులేవో పసిగట్టి తెరదించాల్సింది పోలీసులే.

 విజయనగరం జిల్లా రామతీర్థం రాములవారి ఆలయంలో రాముడి విగ్రహం తల భాగం ధ్వంసం చేసి పక్కనే ఉన్న కోనేరులో పడేసారు. టిడిపి నేత చంద్రబాబు నాయుడు శనివారం రామతీర్థం సందర్శించేందుకు బయలుదేరడంతో వైఎస్ ఆర్ సి నేత ెఁపి వీజయ సాయి రెడ్డి పోటి యాత్ర చేసారు. దాంతో రమ తీర్తంలో ఉద్రిక్త పరిశనివారం రామతీయడంతో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెల కొన్నాయి. టిడిపి నేత చంద్రబాబు మరో వైపు బిజెపి నేతలుకూడ అక్కడ శిబిరం ఏర్పాటు చేసి ఆందోళన జరుపుతున్నారు. ఈ క్రమంలో విజయ సాయిరెడ్డి కారుపై రాళ్ళు విసిరి ఆయన కారు అద్దాలు ధ్వంసం చేసారు.  చంద్రబాబు నాయుడు ఆలయాన్ని సందర్శించే సమయానికి ఆలయం తలుపులు మూసి వేశారు. 



రాష్ట్రంలో వ్యవస్థ భ్రష్టు పట్టడానికి జగనే కారణమని చంద్రబాబు నాయుడు విమర్శించారు. 

‘నా హయాంలో మసీదు, చర్చిలపై దాడులు జరిగాయా? దేశమంతా జై శ్రీరామ్‌ నినాదం మార్మోగుతుంటే.. ఉత్తరాంధ్ర అయోధ్యలో రామచంద్రుడి తల నరికారు. ఎన్టీఆర్‌ హయాంలో రామరాజ్యం చూశాం. పోలీసులు తమాషాలు చేస్తున్నారా?... అందరూ తిరగబడితే పోలీసులు పారిపోతారు. పోలీసులు నా ముందు తోక తిప్పుతారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. 

ఇలాంటి చోటామోటా నాయకుల్ని చాలా మందిని చూశామని, తన దగ్గర మీ నాటకాలు నడవవని హెచ్చరించారు. ఇది పులివెందుల రాజకీయం అనుకుంటున్నారా అని చంద్రబాబు నిలదీశారు. బాబాయ్‌ని చంపినా అడిగేవారు లేరనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. 19 నెలల్లో 127 దేవాలయాలపై దాడులు జరిగాయని తెలిపారు. దేవాలయాల భూముల్ని అన్యాక్రాంతం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడి ఆస్తుల దగ్గరికి వస్తే ఖబడ్దార్‌.. మసైపోతారని చంద్రబాబు హెచ్చరించారు.

దృష్టి మళ్లించేందుకే ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం..సజ్జల రామకృష్ణా రెడ్డి

జగన్‌ జనరంజక పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రాష్ట్రంలోని ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.సీఎంపై బురద చల్లేందుకే తెదేపా అధినేత చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్.. ఇలాంటి చర్యలకు పాల్పడి తన కన్నును తానే పొడుచుకుంటారా? అని సజ్జల ప్రశ్నించారు. అలాంటి అవసరం సీఎంకు లేదన్నారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారు ఎవరైనా త్వరలోనే పట్టుకుంటామన్నారు. నిందితులు దొరికిన తర్వాత వారు ఇలాంటి పనులు చేసేలా ఎవరు ప్రేరేపించారో తప్పక తేలుస్తామని హెచ్చరించారు.






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు