కెసిఆర్ పొర్లి దండాలు పెట్టినా క్షమించం..జైళు కెళ్లడం ఖాయం- బండి సంజయ్


ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ పర్యటన మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇక కేంద్రంపై యుద్ధం అంటూ ప్రకటించిన కెసిఆర్ ఢిల్లీలో వారికి శాలువాలు కప్పి సన్మానించడం వెనక ఆత్రుత పట్టలేక సగటు జీవి మొదలు పోలిటికల్ లీడర్ల వరకు అందరూ ఆసక్తి కనబరిచారు. ఈ విషయంలో రక రకాలుగా విశ్లేషణలు ఊహాగానాలు చేసినా తెలంగాణ భారతీయ జనతా పార్టి నేతలు మాత్రం కెసిఆర్ ఎంత వినయం ప్రదర్శించినా క్షిమించేది లేదంటున్నారు. డిల్లీలో ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుల బండి సంజయ్ కెసిఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోతల రాయుడు ఢిల్లీ వెళ్తారని ముందే చెప్పాం. వంగి.. వంగి.. పొర్లి దండాలు పెట్టినా మేము క్షమించం. ప్రజల దృష్టి మరల్చడానికే కేసీఆర్ ఢిల్లీ పర్యటన. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు చావు దెబ్బ కొట్టారు. లోపల జరిగేది ఒకటి.. కేసీఆర్ బయట చెప్పేది ఇంకొక్కటి. వరదల సమయంలో కేసీఆర్ ఫాంహౌస్ వదిలి బయటకు రాలేదు. కాళేశ్వరం మూడో టీఎంసీ పేరుతో ప్రజాధనం దుర్విని యోగం. కాళేశ్వరానికి తక్కువ సమయంలో కేంద్రం అనుమతులిచ్చిందని కేసీఆరే చెప్పారు. కాళేశ్వరం అంచనాలను అడ్డగోలుగా పెంచారు. ప్రశ్నిస్తే మా రాష్ట్రం.. మా నిధులంటారు.. రాష్ట్రం మీ అయ్య జాగీరా అని ప్రశ్నించారు. 

 కెసిఆర్ ఢిల్లీ పర్యటన సందర్బంగా ప్రధాన మంత్రికి కేంద్ర మంత్రులకు వినమ్ర పూర్వకంగా అభివాదం చేస్తున్న ఫోటోలు మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.  జిహెచ్ఎంసి ఎన్నికల్లో విమర్శించిన కెసిఆర్ వారిని కల్సిన సమయంలో ఎంత వినయం ప్రదర్శించారో ఫోటోలు చూసి రకరకాలుగా చర్చించారు. ప్రధాన మంత్రిని కేంద్ర మంత్రులను కల్సిన కెసిఆర్ ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రానికి రావల్సినపెండింగ్ అంశాలు ప్రస్తావించారు.  అయితే ఒక్కొక్కరి వద్ద సుమారు అరగంటకు పైగా సమయం గడిపిన కెసిఆర్ కేవలం పెండింగ్ అంశాలతో సహా ఇతరత్రా రాజకీయ అంశాలు ఏవైనా ప్రస్తవించరా అనేది అందరి అసక్తి. అయితే ఈ అంశాలు నిర్దారంచే వారెవరూ లేరు. కెసిఆర్ ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన రోజే బిజెపి రాష్ర్ట అధ్యక్షులు బండి సంజయ్ కు ఢిల్లీ నుండి పిలుపు వచ్చిందని దీని మర్మం ఏమిటో అర్దం కాక మీడియా ప్రశ్నార్దక వార్తలు ఇచ్చింది. బిజెపితో కెసిఆర్ అండర్ స్టాండ్ ఉందా లేదా అనేది ఎట్లా ఉన్నా రాష్ట్ర బిజెపి నేతలు మాత్రం స్పష్టమైన వైఖరితో ఉన్నారనే విషయం బండి సంజయ్ మాటల్లో బయట పడింది. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు