శ్వేత సౌధం వీడనున్న ట్రంప్

అమెరికా  ఎన్నికల్లో ఆఖరి ఘట్టం పూర్తి అయింది
ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఫైనల్ గా జో బైడెన్ ను అధ్యక్షులుగా నిర్ణయించాయి 

అమెరికా అధ్యక్ష పీఠంపై రండో సారి తానే కుర్చోవాలని తపించిన డోనాల్డ్ ట్రంప్ కు  ఆఖరి ఘట్టంలో కూడ పరాజయం ఎదురైంది. ఎలక్టోరల్ కాలేజీలు బైడెన్‌ను, ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్‌ను ఎన్నుకున్నాయి. బైడెన్ కు మొత్తం 538 ఎలక్టోరల్‌ కాలేజీ స్థానాలకు గానూ 302 దక్కగా  ట్రంప్‌ కు 232 ఓట్లు వచ్చాయి. ఇక తప్పని సరి పరిస్థితిలో ట్రంప్ శ్వేత సౌధం వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 జో బైడెన్ గెలుపు  గెలుపే కాదని తానే గెలిచానంటూ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ  డోనాల్డ్ ట్రంప్ న్యాయ స్థానాలను ఆశ్రియంచినా ఫలితం లేకుండా పోయింది. సుప్రీం కోర్టును  ఆశ్రయించిన ట్రంప్ కు నిరాశే ఎదురైంది. ట్రంప్ చేసిన ఆరోపణల్లో ఒక్క ఆధారం కూడ లేదని కోర్టు స్పష్టం చేసింది. 


పాపులర్ ఓట్లలో వెనుకబడిన ట్రంప్  ఇప్పుడు ఎలక్టోరల్ ఓట్లలో కూడా పరాభం ఎదుర్కోవడంతో ఆయన చెప్పిన మాట ప్రకారం శ్వేత సౌధాన్ని వీడటం కాయం అయింది. ఎలక్టోరల్ కాలేజీ నిర్ణయమే ఫైనల్ అని ట్రంప్ ఇటీవల ఓ సందర్భంలో చెప్పాడు.  దాంతో జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణస్వీకారం చేయ బోతున్నారు. 

ఎలక్టోరల్ కాలేజి తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు జో బైడన్ కృతజ్ఞతలు తెలిపారు. చివరికి ప్రజాస్వామ్యమే గెలిచిందన్నారు. ప్రజాస్వామ్యం ఖఠిన పరీక్షలనెదుర్కుందని   అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే అమెరికాలో ప్రజాస్వామ్య మనే దీపం వెలిగిందని  ఇప్పడా దీపాన్ని ఏ మహమ్మారి ఏ అధికార దుర్వినియోగం ఆప లేవని అన్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు